మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లని దక్కించుకుంటూ ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తున్నాడు. 'సాగల్' మూవీతో బిగ్ డిజాస్టర్ ని సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ ఆ తరువాత 'అశోక వనంలో అర్జున కల్యణం'తో మళ్లీ సక్సెస్ ని దక్కించుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడు. అయితే ఆ సక్సెస్ మరెంతో సేపు నిలవలేదు. రీసెంట్ గా తమిళ హిట్ మూవీ 'ఓ మైకడవులే' ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన 'ఓరి దేవుడా' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్.
విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో దేవుడిగా నటించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. టాక్ పాజిటివ్ గా వున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విశ్వక్ సేన్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఫస్ట్ రోజే షాకిచ్చింది. ఇదిలా వుంటే యాక్షన్ కింగ్ అర్జున్ సినిమా కారణంగా విశ్వక్‌సేన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
కొంత వరకు ఈ వివాదం కూడా విశ్వక్ కు మైనస్ గా మారినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ తన కూతురు ఐశ్వర్యని హీరోయిన్ గా పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ హీరోగా ఓ భారీ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. పవన్ కల్యాన్ క్లాప్ తో ముహూర్త సన్నివేశాల్ని చిత్రీకరించడం తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే క్షణాల్లో విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని షాకివ్వడంతో అర్జున్ హర్ట్ కావడం..విశ్వక్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
ఆ తరువాత విశ్వక్ కూడా అదే స్థాయిలో అర్జున్ కి కౌంటర్ ఇచ్చేంతగా రిప్లై ఇవ్వడంతో విషయం కాస్తా ఇగోల దాకా వెళ్లి అర్జున్ తన కూతురుతో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని ఆపేసినట్టుగా వార్తలు మొదలయ్యాయి.
ఈ తతంగం తరువాత విశ్వక్ అతిథి పాత్రలో నటించిన 'ముఖచిత్రం' రిలీజ్ అయింది. కేవలం 20 నిమిషాల పాత్రలో విశ్వక్ నటించింది. పాత్ర పరవాలేదనిపించింది కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఇలాంటి క్యారెక్టర్ ని విశ్వక్ సేన్ ఎందుకు అంగీకరించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా వుంటే విశ్వక్ సెలెక్ట్ చేసుకుంటున్న సబ్జెక్ట్ లపై కామెంట్‌లు వినిపిస్తున్న నేపథ్యంలో 'దాస్ కీ ధమ్కీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా అన్నీ తానై రూపొందించిన ఈ మూవీతో విశ్వక్ సేన్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడతాడా అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.