`ఫలక్ నూమా దాస్` చిత్రంతో హీరోగా.. దర్శకనిర్మాతగా తొలి అడుగు వేశాడు విశ్వక్ సేన్. రౌడీ తర్వాత నైజాం యాక్సెంట్ తో ఫుల్ జోష్ ఉన్న కుర్రాడే అంటూ కితాబిచ్చేశారు. విశ్వక్ తనదైన స్టైల్ హైదరాబాదీ యాస తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నాని ప్రొడక్షన్ లో `హిట్` చిత్రంలో హీరోగా నటించాడు. నటుడిగా మంచి మార్కులే వేయించుకున్నా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గానే నిలిచింది. ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అయినా విశ్వక్‌కి ఆఫర్స్ పరంగా కొదవేమీ లేదు. తాజాగా డెబ్యూ డైరెక్టర్ నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీన్ని బెక్కెం వేణుగోపాల్ తన లక్కీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. అతిథిగా విచ్చేసిన హీరో రానా విశ్వక్ సేన్‌పై క్లాప్ నిచ్చి ప్రారంభించారు. ఓ వినూత్న ప్రేమ కథ తో ఈ సినిమాని రూపొందిస్తున్నామని చిత్రబృందం వెల్లడించింది. ఏప్రిల్ రెండో వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ ని జరుపనున్నారు.
ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ కి ఇప్పటివరకూ రౌడీ విజయ్ దేవరకొండకు దొరికినట్టు సరైన స్క్రిప్టు అయితే పడలేదు. ఇప్పటికి రెండు ప్రయత్నాలు కొత్తగా చేయాలని చూసినా స్క్రిప్టు లోపాలో లేక ఇంకేవైనా లోపాలు ఇబ్బంది పెట్టాయి. దేవరకొండకు అర్జున్ రెడ్డి- గీత గోవిందం తగిలినట్టు తనకు మాత్రం ఆ ఛాన్స్ అయితే రాలేదు. ఇక విశ్వక్ ఆరంభమే ఎక్కువ దూకుడు చూపించేయడం తో యాటిట్యూడ్ మార్చుకోవాలన్న గుసగుసలు వినిపించాయి.
ఇప్పటివరకూ వచ్చిన గుర్తింపు తో తప్పటడుగులు వేస్తే కష్టమే. అవకాశం రాగానే కంగారు పడకుండా కాస్త ఆచితూచి అడుగులు వేయాలని ఇండస్ట్రీ అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ఎందుకంటే `ఫలక్ నూమా దాస్` టైమ్‌లో విశ్వక్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తనని తానే ఓ స్టార్ గా ప్రకటించుకుని రెచ్చిపోయాడు. రావడం రావడంతోనే ఇతర హీరోలపై సెటైర్లు వేశాడు. పలు సందర్భాల్లో చీప్ పబ్లిసిటీకి దిగాడనే కామెంట్స్ వచ్చాయి. వేడుకల్లో పాల్గొన్నప్పుడు మాటలు హద్దులు దాటి మాట్లాడటం వంటి దూకుడు అతన్నికి నెగటివ్ గా మారాయి. కొన్ని సార్లు అవే కెరీర్ ని ఇబ్బందుల్లో పడేసే ఛాన్స్ ఉంది. అందుకే తన ప్రవర్తన మార్చుకోవాలని.. పెద్దా చిన్నా అనే రెస్పెక్ట్ తో నడుచుకుని.. తనకున్న టాలెంట్ ని కరెక్ట్ గా వాడుకుంటే వీలైనంత త్వరలోనే పెద్ద స్టార్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి విశ్వక్ పెద్దల సూచనలు పాటిస్తాడా లేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కెరీర్ ని ఇబ్బందుల్లో పడేసుకుంటాడా అన్నది ఆయన చేతుల్లోనే ఉంది. స్వయంకృతం వల్ల అపరాధిగా మారని హీరోల జాబితా లో విశ్వక్ చేరతాడనే ఆశిస్తున్నారంతా. సినిమాల్లో నటించడం ఒకెత్తు.. జనాల్లో మంచివాడిగా పాపులరవ్వడం.. సక్సెస్ తో దూసుకెళ్లడం ఇంకో ఎత్తు. అన్నివిధాలా నెగ్గుకు రావడం ఎలానో ఈ యంగ్ హీరోకి అనుభవం అవ్వాల్సి ఉంటుంది ఇంకా.