ఒకే ఒక్క కన్ను గీటుతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుంది వింక్ గాళ్ ప్రియా వారియర్. `ఒరు ఆడార్ లవ్` తొలి టీజర్ తోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూత్ స్పెల్ బౌండ్ అయిపోయారు. ప్రియా అందచందాలకు ఫిదా అయిపోయి కంటికి కునుకు పట్టని స్థితికి వెళ్లిపోయారు. సన్నీలియోన్, దీపిక పదుకొనేలకు ధీటుగా సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. `ఒరు ఆడార్ లవ్` టీజర్ ఆ స్థాయి సెన్సేషన్స్ సృష్టిస్తుందని - ప్రియా ప్రకాష్ వారియర్ అంతమంది మనసు దోచేస్తుందని కానీ ఆరోజు ఎవరూ ఊహించలేదు. ఆయాచితంగా వచ్చిన ఆ క్రేజుతో ఆ సినిమా మార్కెట్ రేంజ్ అమాంతం స్కైని టచ్ చేసింది. ప్రస్తుతం మలయాళ వెర్షన్ తో పాటుగా తెలుగు వెర్షన్ ని సైమల్టేనియస్ గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ప్రేమికుల రోజు కానుకగా `లవర్స్ డే` పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
రిలీజ్ ముందు ప్రచారంలోనూ వేడి పెంచింది టీమ్. సరిగ్గా వారం ముందు ప్రియా ప్రకాష్ - రోషన్ లిప్ లాక్ టీజర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ టీజర్ జెట్ స్పీడ్ తో అంతర్జాలంలోకి దూసుకెళ్లింది. ఇప్పటికే కోటి పైగా వ్యూస్ ని దక్కించుకుంది. అయితే అంతే ధీటుగా డిస్ లైక్స్ వచ్చాయి. వివాదాలకు ఆజ్యం పోస్తోంది టీజర్. ఈ లిప్ లాక్ టీజర్ ని ఏకంగా 50 వేల మంది డిస్ లైక్ చేయడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇది స్కూల్ పిల్లల్ని వెర్రెత్తించే ప్రయత్నం అంటూ నెటిజనులు తిట్టి పోశారు. ``వ్వాట్ ద హెల్? ఇది రిమాన్సా? లేక చీప్ పబ్లిసిటీ ట్రిక్కా.. ఏంటీ క్లిప్?`` అంటూ తిట్టేశాడు ఓ నెటిజన్. ఇది సెక్సువల్ కంటెంట్.. బ్యాన్ చేయాలి.. అంటూ కొందరు.. స్కూల్ పిల్లల్ని నాశనం చేసే పని ఇది అంటూ మరికొందరు నెగెటివ్ గా స్పందించారు.
ఒకే ఒక్క వింక్ తో ప్రపంచాన్ని గుప్పిట పట్టేసింది ప్రియా. అటుపై ఒకే ఒక్క లిప్ లాక్ తో యూత్ గుండెల్ని టచ్ చేసింది. ఈ క్రేజుతో ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజు అమాంతం పెరిగింది. అలాగే `లవర్స్ డే` హీరోగా పరిచయం అవుతున్న రోషన్ క్రేజు గాళ్స్ లో అసాధారణంగా పెరగడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడు కేరళ సహా అన్ని రాష్ట్రాల్లో గాళ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లవర్ బోయ్ గా వెలిగిపోతున్నాడట. ఈ సినిమా తర్వాత ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ లకు ఛాన్సులే ఛాన్సులు అంటూ ముచ్చట సాగుతోంది. ప్రియాకి ఛాన్స్ ఇచ్చేందుకు ఇప్పటికే అల్లు కాంపౌండ్ రెడీ అవుతోంది. తనని విపరీతంగా అభిమానించే కేరళ ఫ్యాన్స్ కోసమైనా ప్రియాకి అవకాశం ఇచ్చి తీరుతానని బన్ని ఇటీవలే ప్రీరిలీజ్ వేడుకల్లో ప్రామిస్ చేశారు. ప్రియా ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వేడి పెంచుతోంది. తను నటించిన `శ్రీదేవి బంగ్లా` టీజర్ ఇటీవలే రిలీజై సంచలనం సృష్టించింది. శ్రీదేవి మరణంపై కొత్త ప్రశ్నల్ని రేకెత్తించిన శ్రీదేవి బంగ్లా పై ప్రస్తుతం కోర్టు కేసులు రన్ అవుతున్నాయి. కారణం ఏదైనా ఏ ఎటెంప్ట్ చేసినా ప్రియా పేరు మాత్రం మార్మోగిపోతోంది. అసాధారణ క్రేజుతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ.