మరో సూపర్‌ హిట్ సినిమాతో 'ఆహా'..!

Update: 2022-07-28 06:31 GMT
తెలుగు ఓటీటీ ఆహా మొదటి నుండి కూడా మలయాళ సూపర్‌ హిట్ చిత్రాలను డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్‌ చేయడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ మధ్య ఆహా లో వరుసగా మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా లు రావడంతో ఆహా కు అభిమానులు పెరిగారు. డబ్బింగ్‌ సినిమాలు అయినా కూడా ఆహా లో స్ట్రీమింగ్ అయిన సమయంలో సూపర్‌ హిట్ అయిన మలయాళ సినిమాలు చాలా ఉన్నాయి.

మలయాళ సినిమాలు కమర్షియల్‌ గా మన వద్ద ఆడకున్నా ఓటీటీ లో మాత్రం మంచి ఆధరణ దక్కించుకున్నాయి.. దక్కించుకుంటూ ఉన్నాయి. ఆ కారణంగానే మరిన్ని మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ద్వారా రాబోతున్నాయి. మలయాళ స్టార్‌ ఫాహద్ ఫాసిల్ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగు లో ఏదో ఒక ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ అవుతూ ఉన్నాయి.

ఆహా లో ఫాహద్‌ సినిమా లు ఇప్పటికే చాలా వచ్చాయి. తాజాగా ఆయన గత ఏడాది నటించి విడుదల అయిన 'మాలిక్‌' సినిమా ను ఆహా వారు స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్ధం అయ్యారు. కరోనా ఇతర పరిస్థితుల కారణంగా మాలిక్‌ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియో లో డైరెక్ట్‌ రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. అయినా కూడా సినిమాకు అక్కడ మంచి స్పందన దక్కింది.

అమెజాన్ వద్ద మలయాళ రైట్స్ ఉన్నప్పటికి తెలుగు రైట్స్ ను ఆహా వారు దక్కించుకున్నారు. ఆహా లో మాలిక్ ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

కాస్త ఎక్కువ రేటుకే మాలిక్ సినిమా ను ఆహా వారు కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఆహా లో వచ్చే ప్రతి కంటెంట్‌ కూడా చాలా విభిన్నంగా.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

ఆహా ఓటీటీ కంటెంట్‌ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అందుకే మరోసారి మాలిక్ వంటి విభిన్నమైన సినిమా ను ఆహా వారు తమ ఖాతాదారుల కోసం అందించేందుకు సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో ఆహా లో మాలిక్ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు వారాల్లో స్ట్రీమింగ్‌ డేట్‌ పై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News