మణిశర్మ గారు లేకపోతే నేను లేను: తమన్

Update: 2022-07-17 03:30 GMT
విక్రమ్ కుమార్ ఎంచుకునే కథలు .. ఆ కథలను తెరపై ఆయన ఆవిష్కరించే తీరు కొత్తగా ఉంటాయి. అలాంటి విక్రమ్ కుమార్ నుంచి థియేటర్లకు రావడానికి 'థ్యాంక్యూ' రెడీ అవుతోంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చైతూ .. రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. నిన్నరాత్రి వైజాగ్ లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ .. "నా పదేళ్ల జర్నీలో కొన్ని థ్యాంక్యూలు చెప్పుకోవాలి.  

జీవితంలో మనం చాలామందికి రుణపడి ఉంటాము. ఎందుకంటే ఎంతోమంది మనకి ఎన్నో రకాలుగా సాయపడి ఉంటారు. మనం ఎంచుకున్న మన కెరియర్ సక్సెస్  ఫుల్ గా సాగాలంటే మన వెనకాల ఎంతోమంది ఉంటారు. ఒక్కరుగా .. ఒంటరిగా ఎవరూ ఏదీ సాధించలేరు.

ఈ సినిమా చూసిన తరువాత నేను కీరవాణిగారికీ .. రాజ్ కోటి గారికి .. మణిశర్మ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. సాధారణంగా నేను ఏ పార్టీలకు వెళ్లను .. కానీ మొన్న మణిశర్మగారి పార్టీకి వెళ్లాను. 'మీ వల్లనే నేను ఇలా ఉన్నాను సార్' అంటూ హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాను.

సహాయం చేసినవారిని గుర్తుపెట్టుకుని థ్యాంక్స్ చెప్పడమనేది ఈ సినిమా నాకు నేర్పించింది. మణిశర్మగారు లేకపోతే నేను లేను. అందువల్లనే నా పనులన్నీ పక్కన పెట్టేసి వెళ్లి థ్యాంక్స్ చెప్పాను. ఆయన బర్త్ డే రోజున  రెండున్నర గంటలు నేను డ్రమ్స్ వాయించాను.

నేను సాధించిన సక్సెస్ కంటే .. ఆ రెండున్నర గంటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. నన్ను నమ్మండి ఈ సినిమా మీ అందరినీ కూడా కదిలిస్తుంది. దిల్ రాజు గారికి సినిమాలంటే చాలా ప్యాష న్. ఈ కోవిడ్ సమయంలో కూడా ఆరేడు సినిమాలను ఆయన రిలీజ్ చేశారు.

'బృందావనం' నుంచి దిల్ రాజు గారు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. విక్రమ్ కుమార్ తో నేను గతంలో 'మనం' చేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఈ సినిమా నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చైతూ చేసిన 'మజిలీ' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాకి ఏడు రోజుల్లోనే నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను. చైతూ చేసిన వాటిలో లుక్స్ పరంగా నాకు రెండు సినిమాలు ఇష్టం ఒకటి 'మజిలీ' అయితే .. రెండవది 'థ్యాంక్యూ'. ఈ సినిమాలో వేరియేషన్స్ తో కూడిన పాత్రలను చైతూ బాగా చేశాడు. ఈ సినిమా తప్పకుండా ఆయనకి హిట్ ఇస్తుంది" అని చెప్పుకొచ్చాడు.  
Tags:    

Similar News