కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కోర్ట్ రూమ్ డ్రామా జై భీమ్ విమర్శకుల ప్రశంసలతో పాటు కొన్ని వివాదాల్ని వెంట తెచ్చిన సంతి తెలిసిందే. గిరిజనులకు జరిగిన అన్యాయంపై ఉద్వేగభరితమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే దీనిపై రకరకాల వివాదాలు ముసురుకున్నాయి. ఇందులో పోలీసుల్ని క్రూరంగా చూపించారని ఒక వాదన తెరపైకి తెచ్చారు. అది సద్ధుమణిగిన అనంతరం వన్నియార్ సమాజాన్ని ప్రతికూలంగా చిత్రీకరించారని వన్నియార్ సంఘం -పట్టాలి మక్కల్ కట్చి (PMK) రాజకీయ సంస్థ ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది. వన్నియార్ సంఘం అభ్యంతరకరమైన అన్ని దృశ్యాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. జైభీమ్ బృందం తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. దాంతో పాటే రూ.5 కోట్లు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది.
అయితే జై భీమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్ ట్విట్టర్ లో దీనిపై స్పందించారు. ఈ సినిమా వల్ల బాధపడ్డ వారందరికీ క్షమాపణలు చెప్పాడు. జ్ఞానవేల్ విచారం వ్యక్తం చేస్తూ ``ఈ చిత్రం ఉద్దేశపూర్వకంగా ఏదైనా నిర్దిష్ట సమాజాన్ని కించపరచలేదని అన్నారు. OTT విడుదలకు ముందు జై భీమ్ చూసిన ఎవరూ వన్నియార్ సంఘం లోగో అయిన అగ్ని కుండం ఉన్న క్యాలెండర్ ను గమనించలేదని జ్ఞానవేల్ వెల్లడించారు. మేము గమనించి ఉంటే సినిమా విడుదలకు ముందే దాన్ని తీసివేసి ఉండేవాళ్లం`` అని జ్ఞానవేల్ తన ప్రకటనలో తెలిపారు.
హీరో సూర్యను ఈ వివాదంలోకి లాగి నిందలు వేయడం అన్యాయమని దర్శకుడిగా ఆ వివాదానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని జ్ఞానవేల్ అభిప్రాయపడ్డారు. జై భీం చిత్ర బృందం అగ్ని కుండం లోగో క్యాలెండర్ ను తొలగించడం ప్రారంభించిందని దర్శకుడు వెల్లడించారు.