తప్పు లేదంటున్న ఫెయిర్ అండ్ లవ్లీ గర్ల్

Update: 2017-04-30 04:57 GMT
జిహ్వాకొ రుచి పురేకొ బుద్ధి అని వినే ఉంటారు మీరు. అంటే ఒకడికి ఒకటి నచ్చితే మరొకడికి వేరేది నచ్చుతుంది అని. ఒకడికి ఓకే అనిపించింది మరొకడికి ఛీ.. అనికూడా అనిపించవచ్చు. బాలీవుడ్ లో ఇప్పుడు ఒక విషయం పై  అలాంటి చర్చ నడుస్తుంది. అదే .. చర్మ సౌందర్య క్రీములు ఉన్నాయి చూశారు.. ఆ ఫెయిర్నెస్ క్రీమ్ యడ్స్ గురించి ఒకొక్కళ్లు ఒక్కో మాట చెబుతున్నారు. చాలామంది చేయకూడదు అంటే.. కొందరు మాత్రం చేస్తాం అంటున్నారు.

సోనమ్ కపూర్ - దీపికా పడుకోన్ - షాహిద్ కపూర్ - షారుక్ ఖాన్ వంటి స్టార్స్ పై వస్తున్న ఈ చర్చ.. వాళ్ళు చేస్తున్న  బ్రాండింగ్ కు కాస్త ప్రభావం చూపించింది అనే చెప్పాలి. వాళ్ళు కూడా అటువంటి యడ్స్ ఇక చేయం అని చెప్పారు. అయితే ఒక బ్యూటి మాత్రం నేను చేస్తాను అంటోంది. విక్కీ డోనార్ సినిమా తో హింది ఇండస్ట్రి కి పరిచయం అయిన యామి గౌతమ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “ఫేస్ క్రీమ్ అడ్స్ చేయడం తప్పుఏమి కాదు. కాకపోతే పక్కవారి సెంటిమెంట్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ప్రాడక్ట్ కు తగట్టు చేయాలి. ఫెయిర్నెస్ క్రీమ్ యడ్స్ అంటే మరి అందం గురించే చెప్పాలి కదా'' అంటోంది. అసలు ఈ పాపకు పేరు తెచ్చింది.. కాస్త డబ్బులు వెనకేసుకోవడానికి ఛాన్సిచ్చిందే.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లు. ఇప్పుడు వాటిని కాదని ఎలా చెబుతుందిలే.

యామి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సర్కార్ 3 విడుదల కోసం ఎదురుచూస్తుంది. ఈ మధ్యనే ''కాబిల్'' సినిమాతో మాంచి హిట్టే కొట్టింది కాని.. ఎందుకో ఆ సినిమా తరువాత బాలీవుడ్ లో పెద్ద హీరోలెవ్వరూ యామీకి పిలిచి ఆఫర్లు చేతిలో పెట్టలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News