యంత‌ర లోక‌పు సుంద‌రివే

Update: 2018-11-13 10:11 GMT
టాలీవుడ్‌ లో లిరిక్ గుట్టు క‌నిపెట్టాలంటే దానికి చాలానే ప‌రిశోధ‌న చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బాణీ ఇస్తే - దానికి పాట రాయ‌డ‌మెలా? లేదా పాట రాశాక దానికి ట్యూన్ క‌ట్ట‌డ‌మెలా? అన్న‌ది ఒక టాస్క్. ఇక డ‌బ్బింగ్ సినిమాలకు పాట‌లు రాసేవాళ్ల క‌థ‌లు వేరే. అక్క‌డ బీట్ రెడీగా ఉంటుంది.. త‌మిళ/మ‌ల‌యాళ (వేరే భాష ఏదైనా) లిరిక్ రెడీగా ఉంటుంది. దాని అర్థం తెలుగు లిరిసిస్టుకి చెబుతారు. ఆ త‌ర్వాత పాట‌ను రాయాల్సి ఉంటుంది. ఆ లిరిక్ విని పాట‌ను రాసే ప‌ద్ధ‌తి అనుస‌ర‌నీయం అని డ‌బ్బింగ్ రైట‌ర్లు చెబుతుంటారు.

ఇదిగో `2.ఓ` లిరిక్స్ వింటుంటే అవ‌న్నీ గుర్తుకు వ‌స్తున్నాయి. రోబో సినిమా కోసం యంత్రుడా అంటూ పాట రాశారు భువ‌న‌చంద్ర‌. ఆ సినిమాలో ప‌లు పాట‌ల్ని చంద్ర‌బోస్ - వ‌న‌మాలి వంటి రైట‌ర్లు రాశారు. ఈసారి 2.ఓ కోసం స్టార్ రైట‌ర్ల‌నే బ‌రిలో దించారు. టాలీవుడ్ యువ‌లిరిసిస్ట్ అనంత శ్రీ‌రామ్ రాసిన యంత‌ర లోక‌పు సుంద‌రివే పాట‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ లిరిక్ ఆద్యంతం గ‌మ్మ‌త్త‌యిన ప‌దాల‌తో - గ‌మ‌కాల‌తో - య‌తి ప్రాస నియ‌మాల‌తో అనంత శ్రీ‌రామ్ ప్ర‌యోగ‌మే చేశాడు. యంత్రంపై పాట రాయాలంటే కాస్త కాంప్లికేటెడ్ అని కూడా అర్థ‌మ‌వుతోంది.

నా ప్రియ‌మో ప్రియ‌మో బ్యాట‌రివే విడిచి విడిచి వెళ్లిపోకు.. నా ప్రియ‌మో ప్రియ‌మో బ్యాట‌రివే అస‌లేం త‌ర‌గొద్దే! అంటూ చివ‌రికి బ్యాట‌రీ కి కూడా ఛార్జింగ్ చేశారు. అంకెల క‌విత‌లు సెండిజువే.. ఇంజిన్ నీవల్లె చిందునులే.. నా వైఫై .. నువ్వే!! అంటూ చాలా ఇంట్రెస్టింగ్ ప‌ద‌జాలాన్ని అనంత శ్రీ‌రామ్ ఉప‌యోగించారు. ఇలాంటి సినిమాల‌కు త‌న‌దైన శైలిలో వెస్ట్ర‌న్ బీట్‌ తో వెర్రెక్కించే ఏ.ఆర్‌.రెహ‌మాన్ మ‌రోసారి త‌న క్రియేటివిటీ రేంజ్‌ ని చూపించారు. ర‌జ‌నీ-అక్ష‌య్‌-శంక‌ర్-రెహ‌మాన్ దిగ్గ‌జాల క‌ల‌యిక‌లో వ‌స్తున్న `2.ఓ` న‌వంబ‌ర్ 29న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News