అవును.. ఇండియాలోనే సెన్సేషనల్ పాన్ ఇండియా హీరోగా వెలిగిపోతున్న KGF రాకీ భాయ్ యష్ 7స్టార్ హోటల్లో తలదాచుకున్నాడు. తనని తాను రక్షించుకునేందుకు కుటుంబాన్ని కాపాడుకునేందుకు .. అంతేనా తన తోటివారి ప్రాణాల్ని రక్షించేందుకు కూడా అతడు ఈ పని చేశాడు. అంత ఎమర్జెన్సీ ఏం వచ్చింది? ఇదేమైనా 26/11 ముంబై ఎటాక్స్ తరహానా? అంటే.. అంతకుమించి అన్నది అవగతమవుతుంది ఇది చదివాక. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల కోవిడ్ మహమ్మారీ భయాల నడుమ భారతీయ చిత్ర పరిశ్రమ అంతటా సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ COVID-19 నియమాలను అనుసరిస్తూ షూటింగుల్లో పాల్గొంటున్న సంగతి తెలిసినదే. అయితే అలా ప్రయత్నిస్తున్నప్పుడు మహమ్మారి మార్గదర్శకాలను వందశాతం పాటించడం పూర్తి సురక్షితంగా ఉండడం అన్నది సాధ్యమా? అంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఏ ఇతర పరిశ్రమకు సాధ్యమైనా సినీపరిశ్రమకు అలా కుదరకపోవడం దురదృష్టం అనే చెప్పాలి.
ప్రశాంత్ నీల్ KGF 2లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసినదే. అతడు వందలాది కళాకారులతో సాటివారితో కలిసి పని చేశారు. అందువల్ల COVID-19 సంక్షోభం మధ్య తన కుటుంబాన్ని రక్షించడానికి చాప్టర్ 2 సూపర్ స్టార్ యష్ 7-స్టార్ హోటల్ సూట్ ని బుక్ చేసుకున్నాడట. అందులోనే తలదాచుకునేవాడని తెలిసింది.
చిత్రబృందం వెల్లడించిన ఓ అనధికారిక సమాచారం ప్రకారం.. “యష్ డజన్ల కొద్దీ జూనియర్ కళాకారులతో కలిసి నటించాడు. అతని శరీరమంతా మట్టి నకిలీ(డమ్మీ) రక్తంతో సంక్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించడం చాలా కష్టమైంది. నిజానికి ఇలా చేయడం ప్రమాదకరమైంది. డిసెంబర్ 19 తో షెడ్యూల్ ముగించినా యష్ వెంటనే COVID-19 కొరకు పరీక్షలకు వెళ్లాక.. తాజ్ హోటల్ వద్ద తన శాశ్వత సూట్లోకి వెళ్ళాడు. ల్యాబ్ పరీక్షలో యష్ కి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. కేవలం సురక్షితం అని తేలాకే అతను తన భార్య ఇద్దరు పిల్లలను తనను చూడటానికి అనుమతించాడు.
KGF: చాప్టర్ 2 షూటింగ్ తర్వాత యష్ కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. తన సిబ్బంది .. తారాగణం కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. “వారందరికీ నాలాగే కుటుంబాలు ఉన్నాయి. వారి కుటుంబాలు నా కుటుంబం వలె మహమ్మారి కి దూరంగా ఉండాలని కోరుకుంటాను. వారి జీవితాలు అంతే విలువైనవి ” అని యష్ పెద్ద మనసును చూపించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 త్వరలోనే రిలీజ్ చేయాలన్నది చిత్రబృందం ప్లాన్. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేస్తున్నారు.