హీరోల రెమ్యూనరేషన్ ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన అంశమే. పెద్ద హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ ఎంత తీసుకుంటారనే విషయంపై ఎప్పుడూ ఎన్నో ఊహాగానాలు ప్రచారంలో ఉంటాయి. ఊహాగానాలు అనే పదం ఎందుకంటే.. ఒక్క హీరో కూడా నా రెమ్యూనరేషన్ ఇంత అని తన నోటితో తాను చెప్పడు. కనీసం ఆ పారితోషికం ఇచ్చిన నిర్మాత అయినా చెప్తాడా అంటే అదీ జరగని పని. ఎందుకు అంటే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారినుంచి ఇబ్బందులు వస్తాయి కదా అని చిన్నపిల్లాడినడిగినా చెప్తాడు.
అందుకే వీటిని నిర్థారణ చెయ్యడం కష్టం. అయితే సినిమా బడ్జెట్.. కలెక్షన్స్ రేంజ్ ని.. హీరో మార్కెట్ ను బట్టి నిజమా కదా అనేది మాత్రం మనకు అర్థం అవుతుంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండకు ఓ క్రేజీ బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని.. యష్ రాజ్ ఫిలిమ్స్ వారు విజయ్ తో ఒక సినిమా కోసం చర్చలు జరుపుతున్నారని.. ఈ సినిమాకు రూ. 48 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది బహుభాషా చిత్రమని అంటున్నారు. అయితే ఈ వార్త ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించడం లేదని ఇప్పటికే కౌంటర్లు పడుతున్నాయి.
విజయ్ దేవరకొండ మార్కెట్ ఇప్పటి వరకూ ఎంతో సరిగా తేలలేదు. ప్రస్తుతం యాభై కోట్ల కలెక్షన్స్ రేంజ్ అయితే లేదు. అలాంటిది పారితోషికమే యాభై కోట్లు ఇస్తారా? మరో విషయం ఏంటంటే సల్మాన్.. ఆమిర్ ఖాన్ లాంటి వారిని మినహాయిస్తే బాలీవుడ్ లో ఏ ఇతర స్టార్ హీరో రెమ్యూనరేషన్ కూడా 30 కోట్లు ఉండదు. అలాంటిది ఇప్పటివరకూ బాలీవుడ్ సినిమా చేయని హీరోకు మొదటి సినిమాకే 48 కోట్లు ఇవ్వడం అతిశయోక్తి తప్ప మరేమీ లేదని అంటున్నారు.
హీరోకే యాభై కోట్లు ఇస్తే.. బడ్జెట్ ఎంత ఉండాలి? రికవరీ ఎలా? బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఎంత తక్కువ ఖర్చుపెట్టి ఎంత ఎక్కువ రాబట్టాలా అని చూస్తుంటాయి. విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సల్మాన్.. ఆమిర్ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తారని అనుకోవడం మాత్రం ఫసాక్ రూమర్ తప్ప మరేమీ కాదు అని సెటైర్లు పడుతున్నాయి.