ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం గురించి తెలిసినదే. ఈ యాభై ఏళ్లలో ల్యాండ్ మార్క్ అనదగ్గ బ్లాక్ బస్టర్ సినిమాలెన్నిటినో ఈ సంస్థ నిర్మించింది. ఇక ఈ బ్యానర్ లో ధూమ్ సిరీస్ ఒక సంచలనం. అన్ని వర్గాల ప్రేక్షకులకు అదిరిపోయే కమర్షియల్ ట్రీటిచ్చిన ఈ సిరీస్ లో నాలుగో సినిమా తెరకెక్కాల్సి ఉంది.
`ధూమ్` సిరీస్ లో ఇప్పటికి మూడు భాగాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. 4వ భాగాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు అత్యంత భారీ బడ్జెట్ ని కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో సౌత్ స్టార్లను భాగం చేయడం ద్వారా మార్కెట్ రేంజును విస్తరించాలని యష్ రాజ్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇది ఉత్తరాది- దక్షిణాది స్టార్ల కలయికగా ఉండనుంది.
ముఖ్యంగా యష్ రాజ్ సంస్థ ప్రభాస్ కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తోంది. బాహుబలి విడుదలైనప్పటి నుండి చోప్రాలు ప్రభాస్ తో కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఈ చిత్రానికి విలన్ గా ఓకే చేయించాలని నిర్ణయించుకున్నారు. ధూమ్ 4 లో హృతిక్ రోషన్ ఖచ్చితంగా ఉంటాడు. ఈసారి ప్రభాస్ అందులో భాగం కావాలని వారు కోరుకుంటున్నారు.
కానీ ప్రభాస్ ప్రస్తుతానికి రకరకాల చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికీ ఆదిత్య చోప్రా ప్రభాస్ పై నమ్మకంగా ఉన్నారట. ఇంకా ఆశను కోల్పోలేదు. ప్రభాస్ ని ఏదోలా ప్రాజెక్టులో భాగం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతను కరణ్ జోహార్ ను కూడా ఆఫర్ తో పంపాడు. కానీ ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదింకా. యష్ రాజ్ బ్యానర్ ని నిరీక్షణలో ఉంచాడని తెలుస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది? అన్నదానిని బట్టి ప్రభాస్ వైపు నుంచి స్పందన ఉంటుందని భావిస్తున్నారు.