అవును నేను డేటింగులో ఉన్నాను: శ్రుతి హాసన్

Update: 2022-02-17 17:30 GMT
అందానికి అందం .. నాజూకుతనానికి నమూనా శ్రుతి హాసన్. పూతరేకును తమలపాకులో చుట్టినట్టుగా కనిపించే ఈ సుకుమారికి, తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ బ్యూటీకి నటనలోనే కాదు .. మ్యూజిక్ పై కూడా మంచి పట్టుంది. కెరియర్ ఆరంభంలోనే ఐరన్ లెగ్ అనే ముద్ర పడినప్పటికీ, ఆత్మవిశ్వాసంతో ఆ ముద్రను చెరిపేసుకుంది. తమిళంతో పాటు తెలుగులోను  భారీ విజయాలను అందుకుంది. ఒకరకంగా తమిళంలో కంటే ఎక్కువగా ఆమెను తెలుగు ప్రేక్షకులు అభిమానించారు .. ఆరాధించారు.

తెలుగులో ఆమె చేసిన సినిమాలలో 'గబ్బర్ సింగ్' ... 'బలుపు' .. 'రేసుగుర్రం' .. 'శ్రీమంతుడు' .. 'క్రాక్' సినిమాలు రికార్డుస్థాయి విజయాలను అందుకున్నాయి. శ్రుతి హాసన్ క్రేజ్ ను అమాంతంగా పెంచేశాయి. అయితే 'క్రాక్' సినిమాకి ముందు ఆమె తెలుగు సినిమా సక్సెస్ లను లైట్ తీసుకుంది. బాలీవుడ్ లో జెండా ఎగరేసినప్పుడే కెరియర్ కి సార్ధకత అనుకుంది ఆ వైపే ఎక్కువ ఫోకస్ చేసింది. అయితే ఆమె ఆ ప్రయత్నం చేస్తూనే, లవ్ ట్రాక్ లో పడిపోయింది.

ప్రేమ అనేది ఒక మైకమని పెద్దాళ్లు చెప్పినట్టుగానే బయట ప్రపంచాన్ని ఆమె పట్టించుకోలేదు. కెరియర్ ను గురించి అసలు ఆలోచించనే లేదు. ఆ మబ్బు తెరలు కాస్త తొలగిపోగానే అసలు విషయాన్ని గ్రహించేసరికి చాలామంది కొత్త కథానాయికలు ఆమెకి పోటీగా నిలబడ్డారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆమె టాలీవుడ్ కి పరిగెత్తుకొచ్చి 'క్రాక్' హిట్ పట్టుకెళ్లింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన నాయికగా 'సలార్' చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో .. హిట్ అయితే శ్రుతికి పెరిగే డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సమయం కోసమే ఆమె ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇక తనకి సరైన సమయంలో 'క్రాక్'తో హిట్ ఇచ్చి ఆదుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలకృష్ణ సరసన నాయికగా ఆమె ఈ సినిమాలో అలరించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఆమె పాల్గొననుంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక తాజా ఇంటర్వ్యూలో తన గురించి గూగుల్ లో వచ్చిన ప్రశ్నలకు ఆమె తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. తన రిలేషన్ షిప్ ప్రస్తావన రాగానే .. "శ్రుతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికా ఎవరు? అనేదే అందరి ప్రశ్న అనేది నాకు అర్థమైపోయింది. తనకి సంబంధించిన ప్రశ్నలు నాకు మరింత ఉల్లాసంగా అనిపిస్తాయి. అతనితో నేను డైటింగ్ చేస్తున్న మాట నిజమే.

ఇక చాలామంది నా ఆస్తి ఎంత? అని అడుగుతున్నారు. ప్రస్తుతం నేను దానిని కనుక్కునే ప్రయత్నంలోనే  ఉన్నాను. అది మరింత ఎక్కువ అవసరమనే సంగతి నాకు తెలుసు" అని చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News