సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్ని సంవత్సరాల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. ఆ సమయంలో రజినీకాంత్ ఆరోగ్యం గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. రజినీకాంత్ తిరిగి నటిస్తాడనుకోవడం లేదంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. కాని సింగపూర్ లో చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో 2011 జులై 13వ తారీకున చెన్నైకి రజినీకాంత్ చేరుకున్నాడు. ఆ సమయంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది.
అప్పటి విషయాన్ని రజినీకాంత్ కూతురు సౌందర్య గుర్తు చేసుకుంది. సరిగ్గా ఈ రోజు సింగపూర్ నుండి చెన్నైకి వచ్చిన సమయం నాకు బాగా గుర్తుంది. నీవు నిజంగా దేవుడి బిడ్డవు నాన్న.. ఎవరైతే నాన్న కోసం ప్రార్థించారో ఆయన శ్రేయస్సు కోరుకున్నారో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. అప్పటి వీడియోను కూడా సౌందర్య పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యింది.
అనారోగ్యం నుండి బయట పడ్డ తర్వాత రజినీకాంత్ ఫుల్ స్వింగ్ తో మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు విడుదల చేస్తున్నాడు. ప్రస్తుతం 'దర్బార్' చిత్రాన్ని చేస్తున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక ఈ చిత్రం కాకుండా ఇంకా రెండు మూడు సినిమాలకు కూడా సూపర్ స్టార్ కమిట్ అయ్యాడు. ఇదే సమయంలో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు పార్టీ ప్రకటించని రజనీకాంత్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నాడు.