సాధారణంగా తమ అభిమాన హీరోల ఇళ్లు చూసే అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. అయితే - హీరోలు నివసించే ఇళ్లలో బస చేసే అవకాశం మాత్రం ఎవరికీ రాదు. కానీ, బాలీవుడ్ బాద్షా షా షారుక్ ఖాన్ తన అభిమానులకు అటువంటి అవకాశం కల్పించాడు. షారుక్ బస చేసిన ఇంట్లో కావాలనుకున్న వారు విడిది చేయవచ్చు. అయితే, అందుకోసం రోజుకు రూ.2.55 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది మరి.
కొద్ది రోజుల క్రితం షారుక్ ఖాన్ తన ఖాళీ సమయాన్ని గడిపేందుకు కుటుంబంతో పాటు లాస్ ఏంజిల్స్ వెళ్లాడు. బెవర్లీ హిల్స్ అందాలను చూసేందుకు వెళ్లిన షారుక్ ఓ విల్లాలో బస చేశాడు. అక్కడ ఎయిర్ బీఎన్ బీ అనే ఏజెన్స్ షారుక్ విడిది కోసం ఒక విశాలమైన విల్లాను ఏర్పాటు చేసింది. అందులో విశాలమైన ఆరుగదులు - స్విమ్మింగ్ పూల్ లతో పాటు షారుక్ కు కావలసిన అన్ని రకాల హంగులు ఉన్నాయి. అక్కడ నుంచి బెవర్లీ హిల్స్ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో, ఆ విల్లా షారుక్ కు తెగ నచ్చేసింది.
తన ఫ్యామిలీతో సమయం గడిపేందుకు ఎయిర్ బీఎన్ బీ మంచి విల్లాను ఏర్పాటు చేసిందని షారుక్ చెప్పాడు. ఉరుకుల పరుగుల జీవితం నుంచి విశ్రాంతి తీసుకొని బెవర్లీ హిల్స్ లో కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపానని షారుక్ చెప్పాడు. ఇక్కడ ప్రజలు - స్థానిక వాతావరణం తనకు ఎంతగానో నచ్చిందని తెలిపాడు. ఇక్కడి ప్రజలతో తాను అమూల్యమైన సమయం గడిపానని, తనతో పాటు కొన్ని జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని చెప్పాడు. అయితే, ఈ ఖరీదైన విల్లాలో మీరు కూడా ఉండవచ్చు. ఇక్కడ ఒక రోజు బస చేసినందుకు రూ.2.55 లక్షలు చెల్లించాలి. మరి షారుక్ విడిది చేసిన ఇంట్లో బస చేయాలంటే ఆ మాత్రం ఖర్చు భరించక తప్పదు.