నిర్మాతకు కుర్ర హీరో ఝలక్!

Update: 2019-09-08 22:30 GMT
ఎక్కడైనా సెంటిమెంట్లు మొహమాటాలు ఉంటాయేమో కానీ సినిమా వ్యాపారం దగ్గరకు వచ్చేటప్పటికి అవేవి పని చేయవు. అందులోనూ ఇక్కడ పైసా మీదే మొత్తం వ్యవహారాలు నడుస్తాయి కాబట్టి హీరోలు మొదలుకుని టెక్నీషియన్ల దాకా ప్రతిఒక్కరు జాగ్రత్తగా ఉంటారు . ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా షాక్ తప్పదు. ఇదీ అలాంటి సంఘటనే. ఆయనో  పేరు మోసిన డిస్ట్రిబ్యూటర్. తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ప్లెక్స్ చెయిన్ కూడా ఉంది. ఈ మధ్య సినిమా నిర్మాణంలో దిగారు.

యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న ఓ యూత్ హీరోతో ప్రాజెక్ట్ చేయించుకునే పనిలో పడ్డాడు. కొంత మొత్తం అడ్వాన్స్ తరహాలో ముట్టజెప్పాడు కూడా. ఇటీవలే ఈ హీరో తన స్వంత బ్యానర్ మీద గతంలో తనకు బ్రేక్  ఇచ్చిన దర్శకుడిని హీరోగా పెట్టి చిన్నబడ్జెట్ లో ఎంటర్ టైనర్ తీశాడు. టీజర్ రిలీజ్ చేస్తే బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాను సదరు డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాతకు షో వేశాడు హీరో. ఈయన బాగానే ఉందన్న ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చి పంపిణి చేయడానికి ఓకే అన్నాడు

ఇక్కడే ఉంది కథలో అసలు ట్విస్ట్.  తనకు అడ్వాన్సు ఇచ్చిన మొత్తాన్ని ఇప్పుడు తాను నిర్మించిన సినిమా ఎకౌంటులో తీసుకుంటానని ఫైనల్ ఫిగర్ కోట్ చేసి ఆ బాలన్స్ సొమ్ముని ముట్టజెప్పమని కూల్ గా చెప్పాడట హీరో. దీంతో అప్పటిదాకా ఆ హీరోతో సినిమా తీసేందుకు అడ్వాన్సు ఇచ్చానని ఫీలవుతున్న సదరు నిర్మాత ఇప్పుడీ ఇమేజ్ లేని ఆర్టిస్టులతో తీసిన ఈ మూవీకి ఆ మొత్తం అడ్వాన్సు అనగానే షాక్ తిన్నాడట.

హీరో వరస చూస్తుంటే తన మొదటి ప్రొడక్షన్ సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేస్తే అప్పుడు ప్రాజెక్ట్ గురించి ఆలోచిద్దాం అనే రీతిలో ఉండటంతో ఇప్పుడు ఈయన మహా ఇరకాటంలో పడ్డట్టు అయ్యిందట. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే టైపులో ఇప్పుడీ హీరో ఇచ్చిన ట్విస్ట్ కి అంత అనుభావమున్న సీనియర్  డిస్ట్రిబ్యూటర్ సైతం షాక్ తినడం చూస్తే ఇండస్ట్రీ వ్యవహారాలు ఎలా ఉంటాయో  అర్థమయ్యిందిగా


Tags:    

Similar News