టాలీవుడ్ కుర్ర హీరోలు కూడా శాంటా క్లాజ్ కి కోరికల చిట్టా పంపారు. తన మేనకోడలు అన్విత పన్ను రీసెంట్ గా విరిగిపోయిందని అంటున్నాడు అల్లు శిరీష్. అప్పటినుంచి ఫెయిరీ టూత్ వచ్చి తనకు డబ్బులు ఇస్తుందని అనుకుంటోందట అన్విత. ఆ డబ్బులేదో ఇప్పించే పని చేయాలని.. లేదా తనే ఇచ్చేయమని చెప్పి శిరీష్.. తనకు కాసింత డిసిప్లిన్ అలవాటు చేయమని చెబుతున్నాడు.
ఇక కుర్ర హీరో నిఖిల్ అయితే.. కష్టపడ్డం లాంటివన్నీ తనే చేసుకుంటాడట. కానీ తన ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచడం లాంటివి మాత్రం తను చేయలేడట. అందుకనే సిరియా యుద్దం లాంటివి రూపుమాపాలని అంటున్నాడు నిఖిల్. హర్షవర్ధన్ రాణేకి అయితే మ్యాజిక్ టైర్స్ కావాలట. ఎలాంటి గోతుల్లో పడ్డా ఎంచక్కా దూసుకుపోయే టైర్స్ ఇస్తే.. తన కార్ కి అమర్చుకుంటానని చెప్పిన హర్షవర్ధన్.. తన కోరికను ఇంకెవరికీ చెప్పకుండా ఉండాలన్నది రెండో అభ్యర్ధన అంటున్నాడు.
ఇక పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ అయితే.. తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పించేలా బోలెడన్ని రోల్స్ ఇవ్వాలని అడగడంతో పాటు.. ఇతనికి రైటింగ్.. డైరెక్షన్.. సింగింగ్ కూడా చేసేయాలని ఉందట. ఏకంగా ఇండియాకు ప్రధానమంత్రి కూడా అయిపోవాలని ఉందని అంటున్నాడు. ఇప్పుడు మంచి ప్రధాని ఉన్నాడు కాబట్టి.. ఇప్పుడే కాకపోయినా ఫ్యూచర్ లో అయినా ఆ పదవి ఇప్పించమని శాంటాను అడుగుతున్నాడు విజయ్ దేవరకొండ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/