యంగ్ హీరోలకు ఎంత కష్టమొచ్చింది!!

Update: 2016-01-02 04:56 GMT
గత రెండు మూడు సినిమాల్లోనూ వాళ్ళందరూ మాంచి హీరోలే. రేపోమాపో మాంచి బ్లాక్‌ బస్టర్‌ కొట్టేసి పెద్ద హీరోలు అయిపోతేరేమో అని ఆలోచించేలోపే.. అబ్బే అంటూ వారు చతికల పడిపోయారు. సడన్‌ గా ఈ హీరోలు ఇతర పెద్ద హీరోల సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌ పోషిస్తుంటే.. వీళ్ళకంటే బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్‌ వంటి వారే బెటర్‌ అనే ఫీలింగ్‌ వచ్చేస్తుంది ఎవరికైనా!!

బస్‌ స్టాప్‌ వంటి హిట్‌ చిత్రాల్లో హీరోగా నటించిన ప్రిన్స్‌ సెసిల్‌ అనే యువ హీరో నిన్న 'నేను.. శైలజ' చిత్రంలో హీరోయిన్ అన్నయ్యగా ఒక ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌ చేశాడు. 'హ్యాపీడేస్‌, కొత్త బంగారు లోకం' సినిమాల సక్సెస్‌ తరువాత యంగ్‌ సూపర్‌ స్టార్‌ అయిపోతాడని అనుకున్న వరుణ్‌ సందేశ్‌ 'పాండవులు పాండవులు తుమ్మెద', మొన్న రిలీజ్‌ అయిన 'మామ మంచు-అల్లుడు కంచు' చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడు. టాలెంటెడ్‌ హీరో నవదీప్‌ అయితే 'బాద్‌ షా' చిత్రంలో విలన్‌ గా మారిన సంగతి తెలసిందే. ఇలా యంగ్‌ హీరోలందరూ పాపం ఇతర సినిమాల్లో చిన్న రోల్సు వేస్తుంటే.. మరి వారికి వచ్చిన కష్టం చూసి ఎవరికైనా గుండె గుబేల్ అనకమానదు.
Tags:    

Similar News