ఎంబ40 ఈవెంట్లో కుర్రహీరోలందరూ తమ స్పీచులతో ఉర్రూతలూగించారు. ముఖ్యంగా వారందరినీ స్టేజీ మీద మాట్లాడాల్సిందిగా కోరిన హోస్ట్ మంచు మనోజ్ అయితే ఇరగదీశాడు. ''నాకు ఇప్పటికే ఆయన సన్నాఫ్ మోహన్ బాబు అంటూ పుట్టుకతోనే చాలా పెద్ద బిరుదు - హక్కు ఇచ్చారు. ఇంతకంటే దేనికైనా ఆశపడితే కక్కూర్తిగా ఉంటుంది. బాగోదు'' అంటూ అలరించాడు మనోజ్. ఆ తరువాత ఒక్కో హీరోను పిలిచి మాట్లాడాల్సిందిగా మాంచి ఫన్ క్రియేట్ చేశాడు.
ముందుగా అల్లు వారబ్బాయి మైక్ అందుకున్నాడు. ''మోహన్ బాబు గారి గురించి చెప్పేంత పెద్దొడ్ని కాదు. మోహన్ బాబు గారు ఆయన స్కూల్ లో క్యాస్ట్ అనే కాలమ్న్ తీసేయడం చాలా గర్వకారణం. ఆయన సినిమాల చూస్తూనే పెరిగాను.. వాటి గురించి చెప్పలేను.. ఆ స్థాయి నాకు లేదు'' అంటూ చెప్పాడు అల్లు శిరీష్.
''ఇండస్ర్టీకి వచ్చి మూడేళ్ళయ్యింది. నేను మూడు చెరువులు నీళ్ళు తాగుతున్నా. అటువంటిది ఆయన 40 ఏళ్ళ నుండి ఇక్కడే ఉన్నారంటే.. ఎంతో డెడికేషన్ అంతకుమించిన శక్తి ఉండాలి. ఆయన కేవలం లెజండరీ యాక్టర్ కాదు. లెజండరీ పర్సన్ కూడా'' అని సెలవిచ్చాడు వైజాగ్ కుర్రాడు రాజ్ తరుణ్.
''ఎప్పుడైనా హైదరాబాదులో 6 గంటలకు వరుసగా ఆలీ గారి కారు.. బ్రహ్మానందం గారి కారు.. తరువాత నా కారు వెళిపోతుంటే.. ఆ రోజు మోహన్ బాబు గారి షూటింగ్ ఉన్నట్లే. మామూలుగా అయితే 8 గంటల వరకు మా కార్లు వెళ్ళవు. కాని ఒక రోజు ఆయనకంటే ముందు నేను షూటింగ్ కు వచ్చాను. ఆ రోజు ఆయన టిఫిన్ బాక్స్ నాకు ఇచ్చేశారు. అలాంటి సహృదయులు ఆయన'' అంటూ చెప్పాడు సునీల్.
కుర్ర హీరో నిఖిల్ ఫుల్లు ఫీవర్ ఉన్నా కూడా విచ్చేశాడు. ''స్టేజీ మీద ఉన్న చిరంజీవి గారు వెంకీ గారు వంటి లెజండ్స్ సినిమాలను చూసి పెరిగాను. వారి మధ్యన మాట్లాడలేను. ఆల్ ది బెస్ట్ సార్'' అంటూ సెలవిచ్చాడు.
''చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికీ మంచి ప్రాణ స్నేహితుడులా నిలబడ్డారు. అది మోహన్ బాబు గారు. అలాగే మా జనరేషన్ కు ఇనిస్పిరేషన్ గా ఉన్నారు'' అంటూ మోహన్ బాబును అనూహ్యరీతిలో పొగిడేశాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.