రొటీనిటీకి దూరంగా ఆలోచిస్తున్నారు

Update: 2015-11-10 13:30 GMT
ఒక‌ప్పుడు హీరో అంటే చాక్లెట్‌ బోయ్‌ - ల‌వ‌ర్‌ బోయ్ అనే అర్థం. ఆరంభ‌మే ఏదైనా మాంచి ల‌వ్‌ స్టోరీతో ఎంట్రీ ఇస్తే అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా వెలిగిపోవ‌చ్చ‌ని క‌ల‌లుగ‌నేవారు. పైగా టీనేజీలో ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో ఉండే కుర్రాళ్లు హీరోల‌యితే ఇక రొమాన్సేరొమాన్స్‌ - రొమాంటిక్ కామెడీల‌తో - ప్రేమ‌క‌థా చిత్రాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకోవాల‌ని ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇటీవ‌లి కాలంలో ఆ ఆలోచ‌న‌ల్లో కాస్తంత ప‌రిణ‌తి క‌నిపిస్తోంది. ఒక‌వేళ ప్రేమ‌క‌థా చిత్రాల్ని ఎంచుకున్నా.. అందులో కేవ‌లం ల‌వ్ అనే అంశంపైనే ఆధార‌ప‌డ‌కుండా బోలెడంత కాన్‌ ఫ్లిక్టు - కొత్త‌ద‌నం ఉండాల‌ని కోరుకుంటున్నారు.

 ఇటీవ‌లి కాలంలో నిఖిల్ న‌టిస్తున్న సినిమాలు యంగ్ అప్‌ క‌మింగ్ ట్యాలెంటుకు ఆద‌ర్శంగా నిలిచాయంటే త‌ప్పేం కాదు. రొటీన్ స్టీరియోటైపిక్ క్యారెక్ట‌ర్ల కోసం పాకులాడ‌కుండా స్వామిరారా - కార్తికేయ‌ - సూర్య వ‌ర్సెస్ సూర్య వంటి వైవిధ్య‌మైన కాన్సెప్టుల్ని ఎంచుకుని ఇలా కూడా చేయొచ్చు, ప్ర‌యోగాల‌తో విజ‌యాలు అందుకోవ‌చ్చు అని ప్రాక్టిక‌ల్‌ గా ప్రూవ్ చేశాడు. అదే కోవ‌లో ఆ త‌ర్వాత నాగ‌శౌర్య‌ - రాజ్‌ త‌రుణ్‌ - సుమంత్ అశ్విన్ లాంటి హీరోలు రెగ్యుల‌ర్ చాక్లెట్‌ బోయ్ క్యారెక్ట‌ర్ ల‌లోనే కాకుండా సంథింగ్ ఇంకేదైనా కొత్త‌గా ట‌చ్ చేయాలి అని త‌పిస్తున్నారు.

ఇకపోతే నాగ‌శౌర్య న‌టించిన ఊహ‌లు గుస‌గుస‌లాడే సంథింగ్ డిఫ‌రెంట్ మూవీనే. అందులో అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ విస్మ‌రించ‌లేనిది. అలాగే రాజ్‌ త‌రుణ్ ఉయ్యాల జంపాల లాంటి ఎటెంప్ట్ కొత్త‌గా అనిపించింది. లోక‌ల్ యాస‌తో ఎన‌ర్జిటిక్‌ గా క‌నిపిస్తే హీరోకి ప్ల‌స్ అవుతుంద‌ని మరోమారు ప్రూవ్ చేసి యంగ్ జ‌న‌రేష‌న్‌ లో ర‌వితేజ‌లాగా దూసుకుపోతున్నాడు. ఇక సుమంత్ అశ్విన్ పంథానే వేరు. తూనీగ తూనీగ లాంటి ఫ్లాప్ సినిమా త‌ర్వాత అత‌డు అంత‌కుముందు - ఆ త‌రవాత లాంటి ఓ డిఫ‌రెంట్ మూవీని ఎంపిక చేసుకుని స‌క్సెస‌య్యాడు. మునుముందు మిస్ట‌రీ సినిమాలు - డ్రామటిక్ మూవీస్‌ తో రొటీన్ ల‌వ‌ర్‌ బోయ్‌ లా కాకుండా కొత్త‌గా కెరీర్‌ ని ప్లాన్ చేస్తున్నాడు.

ఈ హీరోలంతా రొటీనిటీకి దూరంగానే ఉన్నారు. కొత్త ద‌నాన్ని తెచ్చే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. అది నిజంగా హ‌ర్ష‌నీయం. భ‌విష్య‌త్‌ లో వ‌చ్చే హీరోలు వీళ్ల‌నుంచి కొంత ప‌రిశీలిస్తే త‌ప్పేంకాదు.
Tags:    

Similar News