రష్మిక మందన్న తెలుగు-హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం రెండు హిందీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తోంది. మిషన్ మజ్ను- గుడ్ బాయ్ సినిమాల షెడ్యూల్స్ సాగుతున్నాయి. ఈలోగానే మరో బాలీవుడ్ సినిమాకి సంతకం చేసింది. ఇక హిందీ సినిమాల కోసం ముంబైలో ఉండాల్సి రావడంతో రష్మిక ఓ ఖరీదైన ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ఆమె తన సొంత ఇంట్లో ఉంటూ ఈ సినిమాల షూట్స్ ను పూర్తి చేస్తోంది.
దినిపై మాట్లాడుతూ.. ``నా వృత్తి కారణంగా నేను చాలా ప్రయాణాలు చేస్తున్నాను. నాకు ముంబైలో ఒక ఇల్లు ఉంది. ఇంటి నుండి షూటింగ్ కు వెళ్లడం చాలా బాగుంది. నేను ఎక్కువ కాలం హోటళ్లలో ఉండలేను`` అని తెలిపింది. ఈ ఇంటి లోపలి భాగాన్ని తానే డిజైన్ చేశానని రష్మిక పేర్కొంది. ఇక తన కుటుంబం ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటోంది రష్మిక. తన సోదరికి మధ్య 16 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని ఆమె చెప్పింది. అందువలన రష్మిక తన చెల్లెలికి తానే రెండవ తల్లిని అని తెలిపింది. మిషన్ మజ్ను చిత్రానికి శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. మరోవైపు గుడ్ బాయ్ కి వికాస్ బహల్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఐకన్ లోనూ ఆఫర్..!
ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో బన్ని సరసన అరుదైన అవకాశాన్ని అందుకుంది రష్మిక మందన. పుష్ప డ్యూయాలజీ తర్వాత ఐకాన్ లోనూ కథానాయికగా తన పేరు వినిపిస్తోంది. పుష్ప రెండు భాగాలుగా రూపొందుతుండగా రెండు భాగాల్లోనూ తనకు ఆఫర్ లభించింది. ఆసక్తికరంగా ఈ మిడిల్ లోనే తెరకెక్కనున్న ఐకాన్ మూవీలో బన్ని సరసన నటించే లక్కీ ఛాన్స్ రష్మిక దక్కించుకుంది. అంటే బన్ని ఒకే హీరోయిన్ తో మూడు సినిమాలు చేస్తున్నట్టే లెక్క. అలాంటి అరుదైన అవకాశం రష్మికకు మాత్రమే దక్కుతోంది. ప్రస్తుతం పుష్ప1 చిత్రీకరణ పూర్తవుతోంది. ఈ సినిమా రిలీజయ్యాక సెకండ్ పార్ట్ కి ముందు బన్ని ఐకన్ చిత్రంలో నటిస్తారు. శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు నటీనటులను ఫైనల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటిస్తారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలు రష్మిక-పూజా హెగ్డేలను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.