చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత దర్శకత్వ పగ్గాలు మళ్ళీ చేపట్టాడు ఆదిత్య చోప్రా. అయితే బాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా.. యశ్ రాజ్ ఫిలింస్ ను ఓ రేంజులో నడిపిస్తున్న సారథిగా మనోడికి బాగా పేరుంది. అందుకే ఇప్పుడు ఈయన తీస్తున్న ''బేఫికర్'' సినిమాకు చాలా హైప్ వచ్చేసింది. పైగా ఈ సినిమా కోసం గత ఐదు ఆర్నెల్లుగా ప్రతీ నెలా 9వ తారీఖున ఒక 'కిస్సింగ్' పోస్టర్ ఒకటి విడుదల చేస్తున్నారు. దాదాపు ప్రతీ పోస్టర్లనూ హీరో రణవీర్ సింగ్ తన హీరోయిన్ వాణి కపూర్ పెదాలను గాఢంగా పెనవేసేయడంతో అదో సంచలనం అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంకో అమేజింగ్ విషయం చెప్పాలి.
బేఫికర్ సినిమా మొత్తం ఫ్రెంచ్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతోంది. సినిమాలోని ముఖ్య భాగం అంతా ప్యారిస్ నగరంలో షూట్ చేశారు. తక్కిన సినిమా ఇంతా ఇతర ఫ్రెంచ్ నగరాల్లో తెరకెక్కించారు. అందుకే ఈ సినిమా ఆడియోను ఇప్పుడు ప్రేమికుల నగరంగా పిలువబడనే రొమాంటిక్ ప్యారిస్ సాక్షిగా.. ప్రఖ్యాత ఐఫెల్ టవర్ దగ్గర.. ఒక ఈవెంట్ జరిపి రిలీజ్ చేస్తారట. అసలు ఐఫెల్ అంటేనే ప్యారిస్ గుర్తొస్తుంది మనకు. అందుకే ఆ టవర్ కు అంత ప్రాముఖ్యత. అలాంటి ఒక ఆర్కిటెక్చురల్ అద్భుతం సాక్షిగా ఆడియో ఫంక్షన్ చేయడం అంటే.. అది భారతీయ సినిమాకే గర్వకారణం. ఏదేమైనా కూడా ఆదిత్య చోప్రా ఐడియాలన్నీ అదిరిపోతాయ్ అంతే. ఇకపోతే డిసెంబర్ 9న ఈ సినిమా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/