వైఎస్ ఆర్ బయోపిక్ 'యాత్ర' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ ఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ ఈ చిత్రం మొదటి రెండు రోజులు కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, కేరళల్లో కూడా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఈ చిత్రంపై విమర్శకులు సైతం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ సభ్యులు వైకాపా అధినేత వైఎస్ జగన్ ను కలిసి ప్రత్యేక షోను ఏర్పాటు చేస్తాం, సినిమా చూడాలంటూ విజ్ఞప్తి చేశారట.
జగన్ ప్రత్యేక షో అక్కర్లేదు, థియేటర్ లోనే ప్రేక్షకుల మద్య కుటుంబ సభ్యులతో కలిసి 'యాత్ర'ను చూస్తానంటూ హామీ ఇచ్చాడట. రెండు మూడు రోజుల్లో అభిమానులతో కలిసి థియేటర్ లో యాత్రను చూస్తానంటూ జగన్ చెప్పారట. ప్రేక్షకులతో కలిసి యాత్ర సినిమాను చూసేందుకు జగన్ ఓకే చెప్పడంతో నిర్మాతలు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
థియేటర్ ల్లో నేరుగా అభిమానులను కలిసి యాత్రను చూసేందుకు జగన్ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. యాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మరోసారి తెలుగు జనాలు రాజశేఖర్ రెడ్డి గురించి చర్చించుకోవడం, మాట్లాడుకోవడంతో జగన్ అండ్ కో కూడా చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. యాత్ర సినిమా మొదటి వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు. ఈమద్య కాలంలో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించడం అంటే సూపర్ హిట్ గా చెప్పుకోవచ్చు.