దేశంలోని పంటలపై మిడతల దాడి నేపథ్యంలో దంగల్ సినిమాలో నటించి పాపులర్ అయిన జైరా వసీం చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఆమె ట్వీట్ పై భారీ ఎత్తున నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నెటిజన్ల తిట్లు తట్టుకోలేక జైరా వసీం వెంటనే తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశంలోకి మిడతల దాడిని తాజాగా జైరా వసీం ఖురాన్ ప్రవచనాన్ని ట్వీట్ చేస్తూ దెప్పి పొడిచారు. ’’మనుషుల అహంకారం కారణంగానే మిడతల దాడులు, వరదలు, కరోనా విపత్తులు సంభవిస్తున్నాయి. మనుషులు చేసిన పాపాలకు ఫలితంగానే ఈ ప్రకృతి వైపరీత్యాలు’’ అని జైరా ట్విట్టర్ లో పోస్టు చేసింది.
అయితే ఇందులో ఖురాన్ ను ఉటంకిస్తూ ట్వీట్ చేయడంపై సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఆమెపై ఓ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నిత భావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆమెపై ట్రోలింగ్ కు దిగారు. కొందరు జైరాను సమర్థించారు.
తన వ్యాఖ్యలు వివాదం కావడం.. పెద్ద ఎత్తున ట్వీట్లు, ట్రోలింగ్ జరుగుతుండడంతో వాటిని భరించలేక దంగల్ బేబి ఏకంగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను క్లోజ్ చేసేయడం గమనార్హం. ఇప్పటికే మతాన్ని చూసి విమర్శలు రావడంతో సినిమాల్లో మానేసిన జైరా ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా జరగడం గమనార్హం.