సినిమాల సక్సెస్ కి ప్రచారం ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రచారం లేనిదే జనాల్లోకి ఎలా వెళుతుంది? అసలు ఫలానా సినిమా వస్తోంది అని కనీసంగా తెలిస్తేనే కదా.. థియేటర్ల వరకూ జనం కదిలేది. ఈ శుక్రవారం రిలీజ్‌ల విషయంలో ఓ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ జీరోలో ఉండడం ఫిలిం మీడియాలో ప్రముఖంగా చర్చకొచ్చింది. ఇంతకీ ఏదా సినిమా? అంటే కన్నడ హీరో యశ్ నటించిన కె.జి.ఎఫ్.
ఈ సినిమా ప్రచారం లేక పూర్తిగా జీరో అయిపోయింది. అసలు ఈ సినిమా గురించి క్రిటిక్స్ కే అసలేం తెలీదు. అప్పట్లో ప్రీరిలీజ్ హడావుడి తప్ప ఇంకే ప్రచారం లేకపోవడంతో ఇంతకీ వస్తోందా? అని ప్రశ్నించే వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా కె.జి.ఎఫ్ కి బయట ప్రచారం ఎలా ఉన్నా.. హైదరాబాద్ ప్రచారం సున్నా.. దీంతో దీనిని పట్టించుకున్న వాడే లేకపాయే! అయితే బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని రిలీజ్ చేసిన వారాహి అంత పెద్ద సంస్థ రిలీజ్ చేస్తూ.. ఇలా చేసిందేంటి? అంటూ ఫిలిం మీడియాలోనే ఆసక్తికర డిబేట్ సాగుతోంది.
ఎంత గొప్ప సినిమాకి అయినా ప్రచారం లేకపోతే జీరో అయినట్టే. పైగా పొరుగు హీరో వస్తున్నాడు అంటే కొంతైనా జనాలకు తెలియాలి కదా? రెండు క్రేజీ సినిమాలతో పోటీ పడి మరీ ఈ చిత్రం రిలీజవుతోంది. ట్రెండ్ పరిశీలిస్తే.. ఇటీవలి కాలంలో ప్రచారం కోసం తహ తహలాడని హీరోలు లేరు. తమిళ హీరోలు విజయ్ - ధనుష్ అంతటి వారినే మన జనం పక్కన పెట్టారు. సరైన ప్రచారం లేక ఆ ఇద్దరూ తెలుగు నాట పాపులర్ కావడానికి దశాబ్ధాలే పట్టింది. ఆ ఇద్దరూ ఇటీవల ఆలోచన మార్చుకుని ప్రచారం చేసుకునే పనిలో ఉన్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ అంతటి వారే తెలుగు రాష్ట్రాల ప్రచారం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. తన `ఓడియన్` సినిమా అంతంత మాత్రమేనని తెలిసినా ప్రచారం కోసం ప్రయత్నించారు. కానీ కేజీఎఫ్ టీమ్ ఏంటో? మూడు రోజుల్లో రిలీజ్.. అయినా మీడియాకి దూరం దూరంగా ఉన్నారు. అయితే ఈ సినిమాని దేశ వ్యాప్తంగా భారీ రిలీజ్ చేస్తుండడంతో తెలుగు వారిని పట్టించుకునేంత సమయం వీరికి ఉండకపోవచ్చన్న మాటా వినిపిస్తోంది. లేదూ ఏవో రెండు మూడు చానెళ్లలో ఊదరగొట్టేస్తే అందరికీ తెలిసిపోయినట్టేనని భావించి ఉండడం కూడా మరో కారణం కావొచ్చన్న మాటా వినిపిస్తోంది. కె.జి.ఎఫ్ కనీసం మెట్రోల్లో అయినా కొట్టుకొచ్చేస్తుందేమో అనుకుంటే అదే రోజు అన్ని మెట్రోల్లో షారూక్ `జీరో` పెద్ద ఎర్తింగ్ పెట్టబోతోంది. అంతిమంగా ఫేట్ ఎలా డిసైడ్ అయ్యిందో కాస్త వేచి చూడాలి.