టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'అ!' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు మూడో సినిమాగా ''జాంబీ రెడ్డి'' అనే విభిన్న తరహా చిత్రాన్ని ప్రకటించారు. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వణికిస్తున్న వైరస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ లోగో ఇటీవలే రిలీజ్ అయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా టైటిల్ రోల్ పోషిస్తున్న హీరో బ్యాక్ సైడ్ లుక్ ని విడుదల చేశారు. ఇప్పుడు లేటెస్టుగా తేజ సజ్జను హీరోగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మాస్టర్ తేజ.. ఈ మధ్య 'ఓ బేబీ' సినిమాలో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో పూర్తి స్థాయి హీరోగా మారిన తేజ సజ్జ తెలుగులో రూపొందుతున్న ఫస్ట్ జోంబీ సినిమా 'జాంబీ రెడ్డి'లో నటిస్తున్నాడు. నేడు తేజ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో అతని లుక్ ని రివీల్ చేశారు. 'జోంబీ రెడ్డి' చిత్రాన్ని ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. అయితే తెలుగులో ఇలాంటి జాంబీల కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా 'జాంబీ' అనేది ఓ ఫిక్షనల్ క్యారెక్టర్. చనిపోయిన తరువాత కూడా శవాలు లేచి తిరుగుతూ బ్రతికున్న వాళ్లని పీక్కుతింటాయి. వీటికి ఆకలి తప్ప.. చావు అనేదే ఉండదు. హాలీవుడ్ లో ఇలా జాంబీల మీద ఎన్నో సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. బాలీవుడ్ లో కూడా సైఫ్ అలీఖాన్ 'గో గోవా గోన్' అనే సినిమా తీశాడు. ఇక తమిళంలో జయం రవి జాంబీ మూవీలో నటించాడు. అయితే ఇది కేవలం కొంత మంది మాత్రమే చూడగలిగే జోనర్. దీన్ని హారర్ అనలేం అలా అని థ్రిల్లర్ అని కూడా అనలేం. ఇదో ఫ్యూజన్ జోనర్. తెలుగు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసే కెపాసిటీ ఉన్న జోనర్. మరి ఇప్పుడు ప్రశాంత్ వర్మకి ఈ 'జాంబీ' కాన్సెప్ట్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో. 'జాంబీ రెడ్డి' మూవీ స్టార్ అవుదామనుకుంటున్న తేజకు.. స్టార్ డైరెక్టర్ అవుదామనుకుంటున్న ప్రశాంత్ వర్మకి ఇద్దరికీ కీలకమైన సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా హిట్ అయితే ఇద్దరికీ ఓకే.. కానీ రిజల్ట్ మరోలా వస్తే మాత్రం తరువాత సినిమాలు రావడం కష్టమని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.