'తిక్క' భామ‌తో ఆర్య‌న్ ఖాన్ తైతక్క నిజ‌మేనా?

ఆర్య‌న్ సైత అంతే ఆద‌రిస్తూ గురుడు ప్రేమ పాఠాల్లో బిజీ అయిన‌ట్లు గుస గుస డై బై డే పెరుగుతూనే ఉంది.

Update: 2024-07-08 07:28 GMT

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ బ్రెజిల్ భామ ల‌రిస్సా బొనెసీతో డేటింగ్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నిజ‌మెంతో తెలియ‌దుగానీ కొన్ని నెల‌లుగా ప్ర‌చార‌మైతే పీక్స్ లో జ‌రుగుతోంది. ఇండియాలో సినిమా అవ‌కాశాల కోసం బ్రెజిల్ నుంచి దిగిన బ్యూటీ ఆర్య‌న్ కి ద‌గ్గ‌రైన‌ట్లు మీడియా కోడై కూస్తుంది. ఆర్య‌న్ సైత అంతే ఆద‌రిస్తూ గురుడు ప్రేమ పాఠాల్లో బిజీ అయిన‌ట్లు గుస గుస డై బై డే పెరుగుతూనే ఉంది.

తాజాగా మ‌రోసారి ఇద్ద‌రు పార్టీలో చిల్ అవుతున్న‌ట్లు మ‌రో ప్రచారం తెర‌పైకి వ‌స్తుంది. ఆదివారం రాత్రి ముంబైలో హై-ప్రొఫైల్ పార్టీ స్వాంకీ రెస్టారెంట్ లో జ‌రిగింది. ఇందులో ఇద్ద‌రు పాల్గొన్న‌ట్లు లీకులందు తున్నాయి. ఇక్క‌డ కొన్ని లీకులు సైతం వైర‌ల్ అవుతున్నాయి. ఆర్యన్ - లారిస్సా వేర్వేరుగా వేదికలోకి ప్రవేశించిన‌ట్లు వినిపిస్తుంది. ముందుగా ఆర్యన్ ఒంటరిగా ఎంట‌ర్ అవ్వ‌గా..ఆ కాసేప‌టికి లారిస్సా తన స్నేహితుల బృందంతో అదే రెస్టారెంట్ లో కి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అక్క‌డ ఓలేడీతో ఆర్యన్ సంభాషిస్తున్నాడు. కానీ ఆమె బ్రెజిల్ బ్యూటీనా? మ‌రో లేడానా? అన్న‌ది క్లారిటీలేదు. ఆ మ‌హిళ ముఖం అస్ప‌ష్టంగా ఉంది. దీంతో ఆ లేడీ ఎవ‌రు? అన్న‌ది మిస్ట‌రీగానూ మారింది. కానీ నెట్టింట నెటి జనులు మాత్రం లారిస్సా అనే వాద‌న తెరపైకి తెస్తున్నారు. కానీ క్లారిటీ లేని ముఖం కావ‌డంతో? ఆర్య‌న్ సంభాషిస్తుంది? అమెనా అన‌డానికి స‌రైన ఆధారం క‌నిపించ‌లేదు.

పైగా ఇంత‌వ‌ర‌కూ ఆర్య‌న్ గానీ, లారిస్సా గానీ ఏ సంద‌ర్భంలోనూ డేటింగ్ లో ఉన్న‌ట్లు ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఈ టాపిక్ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీ వీడియోగానీ, ఫోటోలుగానీ బ‌య‌ట‌కు వ‌స్తే త‌ప్ప అందులో ఉన్న‌ది ఎవ‌రు? అన్న‌ది క్లారిటీ రాదు. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ‌త్యాసం అయితే భారీగా ఉంది. లారిస్సాకి 34 ఏళ్లు కాగా, ఆర్య‌న్ ఖాన్ త‌న‌క‌న్నా 8ఏళ్లు చిన్న‌వాడు. ఈ భామ తెలుగు ఆడియ‌న్స్ కి సుప‌రిచిత‌మే. సాయి ధరమ్ తేజ్ సరసన 'తిక్క' లో న‌టించింది.

Tags:    

Similar News