ఆషికా.. చీరలో సొగసుల మాయ
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి సక్సెస్ ఇవ్వలేదు
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి సక్సెస్ ఇవ్వలేదు. అయితే తరువాత కింగ్ నాగార్జునకి జోడీగా చేసిన ‘నా సామిరంగా’ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో ‘విశ్వంభర’లో ఓ కీలక పాత్రలో ఈ అమ్మడు కనిపించనుంది. నిజానికి ఈ బ్యూటీ 2016లో ‘క్రేజీ బాయ్’ సినిమాతో హీరోయిన్ గా కన్నడంలో అరంగేట్రం చేసింది.
ఆ తరువాత వరుసగా కన్నడంలో స్టార్ హీరోలతో జతకట్టింది. 2022లో ‘పట్టతు అరసన్’ సినిమాతో ఆషికా కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2023లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆషికా రంగనాథ్ తమిళ్ రెండో సినిమాని సిద్ధార్ధ్ తో చేసింది. ‘మిస్ యు’ టైటిల్ తో ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. నిజానికి ఈ సినిమా నవంబర్ 29న రిలీజ్ కావాల్సి ఉంది. మూవీ ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే తుఫాన్ ప్రభావం వలన ఈ సినిమాని వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఆషికా రంగనాథ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. అదిరిపోయే స్టైల్ మోడ్రన్ శారీస్ తో ఈ అమ్మడు అందరిని ఎట్రాక్ట్ చేసింది. ‘మిస్ యు’ ప్రమోషన్స్ సందర్భంగా ఈమె దిగిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లైట్ బ్లూ మిక్స్ వైట్ కలర్ సిల్క్ శారీలో ఆషికా రంగనాథ్ ఇట్టే ఎట్రాక్ట్ చేస్తోంది.
ఆమె లుక్స్, స్టైల్ చూస్తుంటే అందానికి ఆభరణంగా ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యూత్ క్రష్ గా ఉంది. కన్నడంలో ఆషికా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ అమ్మడుకి తెలుగు, తమిళ్ భాషలలో సరైన బ్లాక్ బస్టర్స్ పడితే ఇక్కడ కూడా టాప్ స్టార్ గా మారిపోతుందని ఆమె అభిమానులు అంటున్నారు. తమిళంలో కార్తీకి జోడీగా ‘సర్దార్ 2’ మూవీలో ఆషికా రంగనాథ్ నటిస్తోంది. హిట్ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రంతో ఆమెకి సాలిడ్ బ్రేక్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.