విశ్వంభర సెట్ లో అందాల భామ..!

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర.

Update: 2024-09-24 12:57 GMT

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా లాంటి భామలు నటిస్తున్నారు. చిరుతో మళ్లీ జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాగా విశ్వంభర వస్తుందని టాక్. బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ట చిరుతో ఈ మెగా మూవీని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాడని తెలుస్తుంది.

విశ్వంభర సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. లేటెస్ట్ గా సినిమా సెట్ నుంచి హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఒక ఫోటో షేర్ చేసింది. సెట్ లో చెయిర్ లో డైరెక్టర్ తో సరదాగా మాట్లాడుతున్న ఫోటో షేర్ చేసింది. ఐతే అమ్మడు క్యాజువల్ డ్రెస్ లోనే ఉంది. వితౌట్ మేకప్ కూడా అనిపిస్తుంది. సినిమాలో ఆమె లుక్ ఆల్రెడీ పోస్టర్ వదలగా లేటెస్ట్ గా వశిష్టతో దిగిన ఫోటోని షేర్ చేసి సర్ ప్రైజ్ చేసింది ఆషిక.

తన ఇన్ స్టాగ్రాం లో స్టేటస్ లో ఈ ఫోటోని పెట్టుకుంది. విశ్వంభర సినిమాతో తప్పకుండా అమ్మడు మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తుంది. దీనితో పాటు ఆషిక కింగ్ నాగార్జునతో చేసిన నా సామిరంగ సినిమా కన్నడ వెర్షన్ స్టార్ సువర్ణలో స్ట్రీమింగ్ అవుతుంది. దానికి సంబందించిన అప్డేట్ ని కూడా తన ఇన్ స్టా స్టేటస్ లో పెట్టుకుంది ఆషిక. ఆషిక రంగనాథ్ తెలుగులో అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అమ్మడికి నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ దక్కింది.

నాగార్జునతోనే నెక్స్ట్ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. నా సామిరంగ టీం తోనే మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట నాగార్జున. అలా అయితే హీరోయిన్ గా ఆషికనే తీసుకుంటారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఆషికాకు కాస్త పుష్ ఇస్తే చాలు కానీ తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అందుకే విశ్వంభర సినిమా మీదే తన హోప్స్ పెట్టుకుంది. నా సామిరంగ హిట్ తర్వాత ఆఫర్లు వచ్చినా ఆచితూచి అడుగులేయాలనే కారణంతోనే అమ్మడు సెలెక్టెడ్ సినిమాలు చేస్తుందని తెలుస్తుంది.

Tags:    

Similar News