డంకీలో టామ్ క్రూజ్ స్టంట్ కావాలన్న ఫ్యాన్
'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్' నుండి టామ్ క్రూజ్ లెజెండరీ స్టంట్ ఫోటోని షేర్ చేసి, MI:7లో టామ్ క్రూజ్ చేసినట్లుగా మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
కింగ్ ఖాన్ షారూఖ్ పఠాన్, జవాన్ సినిమాల గ్రాండ్ సక్సెస్ తో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశాడు. అతడు నటించిన డంకీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బాద్ షా ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ పెంచాడు. డంకీ నుంచి ప్రమోషనల్ మెటీరియల్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉన్నాడు. రాజ్ కుమార్ హిరాణీ లాంటి మాస్టర్ మైండ్ నుంచి వస్తున్న సినిమాగా డంకీపై భారీ అంచనాలున్నాయి.
తాజాగా X (Twitter)లో #AskSRK సెషన్స్‌లో షారూఖ్ ఖాన్ అభిమానులతో టచ్ లోకి వెళ్లారు. ఖాన్ తనదైన శైలిలో ఫ్యాన్స్ తో సంభాషణలకు చమత్కారమైన ప్రతిస్పందనలు ఇచ్చారు. ఒక అభిమాని టామ్ క్రూజ్ యాంగిల్‌ను టచ్ చేస్తూ ఖాన్ ని ప్రశ్నించాడు. 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్' నుండి టామ్ క్రూజ్ లెజెండరీ స్టంట్ ఫోటోని షేర్ చేసి, MI:7లో టామ్ క్రూజ్ చేసినట్లుగా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అని అడిగాడు. దానికి SRK తనదైన ట్రేడ్‌మార్క్ హాస్యంతో స్పందిస్తూ, "మేరే పాస్ మోటార్‌సైకిల్ నహీ హై యార్!!! #డంకీ" అని అన్నారు. భయాందోళనలు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? అని ఒక అభిమాని అడిగినప్పుడు SRK ఇలా అన్నారు. నేను నాడిపై దృష్టి పెట్టి నిశ్శబ్దంగా ఉండటం ద్వారా నరాలను అదుపులోకి తెస్తాను... నేను కొంచెం ఏదైనా రాస్తాను..పిల్లలతో గడుపుతాను.. అని అన్నాడు.
డంకీ సినిమాని థియేటర్లలో కాకుండా స్టేడియంలో ప్రదర్శించాలని ఒక అభిమాని కోరారు. దానికి స్పందించిన షారూఖ్.. థియేటర్లలో అయితేనే ఏసీ ఉంటుంది. పిల్లలు, పెద్దలు కలిసి హాయిగా సినిమా చూడొచ్చు. స్టేడియంలో ఏసీ ఇతర సౌకర్యాలు ఉండవని అన్నారు. థియేటర్లలోనే సినిమాని చూడండి అని అన్నారు.
మరో అభిమాని SRKని అభినందిస్తూ, ఖాన్ పేరు ప్రేమ భావనకు పర్యాయపదంగా ఉండాలని సూచించాడు. SRK స్పందిస్తూ, "అప్పుడు సెక్సీ బ్రదర్ కోసం ఏమి ఉపయోగించాలి ?? హా హా" అని చిలిపిగా అన్నారు. ఇంత కాలం 'ది షార్క్'గా ఎలా ఉండగలుగుతున్నాడన్న అభిమాని ప్రశ్నకు షారూఖ్ ఖాన్ స్పందిస్తూ, "నేను నేనే. మరెవరూ లేరు కాబట్టి, అలా మారడం నాకు మాత్రమే బాగా తెలుసు"అని అన్నారు. డంకీ థియేటర్లు హౌస్‌ఫుల్ అయితే ఇంటి నుండి సోఫా తీసుకురావాలని అభిమానులకు సలహా ఇచ్చారు SRK. ఇలాంటి ఎన్నో ఛమత్కారమైన హాస్యభరితమైన సమాధానాలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.