అయలాన్ ట్రైలర్: భూమిని కాపాడే గ్రహాంతరవాసి?
కోలీవుడ్ లో దిగ్గజ హీరోలు ఎందరు ఉన్నా, తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించిన నటుడు శివకార్తికేయన్.
కోలీవుడ్ లో దిగ్గజ హీరోలు ఎందరు ఉన్నా, తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించిన నటుడు శివకార్తికేయన్. అతడు నటించిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ నేపథ్య సినిమా అయలాన్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సంక్రాంతి పండక్కి విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రాలలో అయలాన్ ఒకటి. నిజానికి ఫస్ట్ లుక్ - టీజర్ విడుదలైనప్పటి నుండి అయలాన్ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్భుతమైన చిత్రంగా ప్రజల మైండ్ లో రిజిస్టర్ అయింది. తాజాగా రిలీజైన ట్రైలర్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. 2.19 నిమిషాల ట్రైలర్‌ని చూసిన తర్వాత, తమిళ చిత్ర పరిశ్రమలో అయలాన్ శివకార్తికేయన్ రేంజును మరింత పెంచుతుందన్న అంచనా ఏర్పడింది.
అయలాన్ కథాంశం ఆసక్తిని కలిగిస్తోంది. పెంపుడు జంతువులు, కీటకాల గురించి పట్టించుకునే రైతు (శివకార్తికేయన్ పోషించిన) కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా. దుష్ట మల్టీ-మిలియనీర్ వ్యాపారవేత్త (శరద్ కేల్కర్ పోషించాడు) అరుదైన అమూల్యమైన ఒక ప్రత్యేక ఖనిజాన్ని పొందాలని కోరుకుంటాడు. అన్‌బ్టైనియం రాక్‌ని కనుగొనాలనేది అతడి తపన. కానీ ఇంతలోనే ఆ ఇద్దరి మధ్యకు ఒక గ్రహాంతర వాసి వచ్చి చేరతాడు. భూమిని, తన గ్రహాన్ని నాశనం చేసే ఈ అన్వేషణను ఆపడానికి ఒక ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ గ్రహాంతర వాసి ప్రత్యేక లక్ష్యంతో భూమికి వస్తాడు. గ్రహాంతరవాసి మంచి వాడైన రైతు శివకార్తికేయన్‌తో స్నేహం చేస్తాడు. అటుపై వారు అజేయమైన శక్తిగా మారుతారు.
కథగా ఇది వినేందుకు సింపుల్ గా ఉండొచ్చు. కానీ వీఎఫ్ ఎక్స్ మాయాజాలంలో సన్నివేశాలను మలిచిన తీరు ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం విజువల్ గ్రాఫిక్స్ ఎంతో అద్భుతంగా కుదిరాయని క్లారిటీ వచ్చింది. అయలాన్ ట్రైలర్ విడుదలైన వెంటనే అది వైరల్‌గా మారింది. పాన్ ఇండియా ప్రేక్షకులు ఆకట్టుకునే VFX వర్క్ తో మిళితం చేసిన కథనం ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రత్యేకించి లావణ్య త్రిపాఠి మెరుపులు గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. రెహమాన్ నేపథ్య సంగీతం ఎప్పటిలానే పెద్ద ప్లస్.
ఈ ట్రైలర్ వీక్షించాక నెటిజనులు వారి అభిప్రాయాల్ని సోషల్ మీడియాల్లో పంచుకున్నారు. సాంస్కృతిక విలువల వక్రీకరించిన దృక్కోణాన్ని తరచుగా చిత్రీకరిస్తూ ఇటీవలి సినిమాల్లో హింసపై ఎక్కువగా దృష్టి సారించే యుగంలో, శాంతియుత సందేశంతో శివకార్తికేయన్ అన్న అంతరిక్షం నుండి ప్రవేశించడం నిజంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. అతని విధానం రిఫ్రెష్‌గా ప్రత్యేకమైనది ముఖ్యమైనది... అని ఒక నెటిజన్ ప్రశంసించాడు. మెస్మరైజింగ్ ట్రైలర్!! ఈ చిత్రం భారతీయ VFX పరిశ్రమకు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.. నిజంగా ఒక ముందడుగు వేసింది. ఫాంటమ్ ఎఫ్‌ఎక్స్ టీమ్ సంవత్సరాల కృషి, అంకితభావానికి ప్రశంసలు!! అని మరొకరు ప్రశంసించారు. అయాలాన్‌కి ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించగా, కెజెఆర్ స్టూడియోస్ నిర్మించింది. ఆస్కార్ గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం ప్రధాన బలం. అయాలాన్ 12 జనవరి 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుంది.