2000 కోట్లొస్తే మాకు మాత్రం కోటే ఇచ్చారు!
అమీర్ ఖాన్ నటించిన `దంగల్` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
అమీర్ ఖాన్ నటించిన `దంగల్` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. నితీష్ తివారీ తెరకెక్కించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్ఠించింది. ఇప్పటికీ ఆ రికార్డు అలా పదిలంగానే ఉంది. `బాహుబలి`, `కేజీఎఫ్` లాంటి సినిమాలు దరిదాపుల్లోకి వచ్చాయి గానీ బీట్ చేయలే కపోయాయి. మహవీర్ సింగ్ ఫోగోట్ జీవిత కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.
చైనా, జపాన్ వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రమిది. బయోపిక్ అంటే ఇలా ఉండాలని నితీష్ ప్రూవ్ చేసాడు. తాను రెజ్లర్ కాలేకపోయినా కుమార్తెల్ని గొప్ప రెజ్లర్ గా చేసి తన కలను నేర వేర్చుకున్న గొప్ప వ్యక్తి మహావీర్. అతడి కథలో ఎంతో ఎమోషన్ ఉంది. ప్రతిభతో పాటు అద్భుతమైన ఎమోషన్ ని నితీష్ ఆవిష్కరించిన విధానం ఓ వండర్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా కథగానూ మహావీర్ సింగ్ ఫ్యామిలీ కి మేకర్స్ కోటి అందించినట్లు బబితా ఫోగాట్ బయట పెట్టింది.
`ఈ ప్రాజెక్ట్ లోకి అమీర్ ఖాన్ రాకముందే కోటి రూపాయల ఒప్పందం జరిగింది. కోటి రూపాయలే ఇచ్చారని మేము ఏ రోజు బాధపడలేదు. దానిగురించి ఆలోచించలేదు. ఎందుకంటే మా తండ్రి మహావీర్ ఫోగాట్ కథని ఎంతో మందికి తెలిసేలా చేసారు. తాను జీవితంలో వైఫల్యం అయ్యానని నిరుత్సాహ పడకుండా తన విజయంలో మమ్మల్ని బాగం చేసి గొప్ప స్థానానికి తీసుకెళ్లారు. అలాంటి ఆయన కథని డబ్బుతో ముడిపెట్టడం మాకు ఇష్టం లేదు` అని అన్నారు.
మహావీర్ ఫోగాట్ రెండవ కుమార్తె బబితా ఫోగాట్. 2010 కామన్ వెల్త్ లో వెండి పతకం సాధించింది. 2014లో బంగారు పతకం అందుకుంది. 2012 లో వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం సాధించింది. 2019 లో రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయాల్లో చేరింది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతోంది.