బేబీ బాక్సాఫీస్.. 4వ రోజు కూడా దద్దిరిల్లిపోయింది

ఈ సినిమా కు మొదటి రెండు రోజుల కంటే కూడా 4వ రోజు ఎక్కువ స్థాయి లో కలెక్షన్స్ రావడం విశేషం

Update: 2023-07-18 06:04 GMT

ఆనంద్ దేవరకొండ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మొదటి విజయాన్ని అందుకున్నాడు. అది కూడా స్టార్ హీరోల లెవెల్లో అతనికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. సాధారణంగా మొదటి వీకెండ్ లో కాస్త హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కలెక్షన్స్ బాగానే అందుకుంటూ ఉంటాయి. కానీ సోమవారం రోజు మాత్రం అసలు మళ్లీ అదే తరహా లో కలెక్షన్స్ రావడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.

కానీ బేబీ సినిమా విషయం లో మాత్రం అది చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ సినిమా కు మొదటి రెండు రోజుల కంటే కూడా 4వ రోజు ఎక్కువ స్థాయి లో కలెక్షన్స్ రావడం విశేషం. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో అయితే సోమవారం రోజు చాలా ఏరియా లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇక మొత్తంగా నాలుగవ రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో మొదటి రోజు 2.60 కోట్లు అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత రెండవ రోజు 2.98 కోట్లు సాధించింది. ఇక మూడవ రోజు అంతకుమించి అనేలా 3.77 కోట్లు అందుకున్న బేబీ నాల్గవ రోజు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అదే రేంజ్ లో 3.72 కోట్లు సాధించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఈ సినిమా నాలుగు రోజుల్లో మొత్తంగా 13.07 కోట్ల షేర్ 22.80 కోట్ల గ్రాస్ అందుకుంది.

ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలిపి బేబీ సినిమా 56 లక్షలు, ఓవర్సీస్ లో 1.78 కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 15.41 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా 28.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే బేబీ సినిమా 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.

ఇక 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు 15.41 కోట్ల షేర్ రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా ఊహించిన విధంగా 7.41 కోట్లు ప్రాఫిట్స్ అయితే అందించింది. ఇక సోమవారం రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి మిగతా రోజుల్లో కూడా మినిమం కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీకెండ్ వరకు కూడా బేబీ సినిమా మంచి ఆదాయాన్ని అందుకునే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News