'బేబీ' క్రియేటర్స్ ఏం చేస్తున్నారో తెలుసా..!
కేవలం బేబీ రీమేక్ మాత్రమే బేబీ తరహా లవ్ స్టోరీస్ మరియు కాలేజ్ లైఫ్ స్టోరీస్ తో సినిమాలను నిర్మించేందుకు గాను రెడీ అవుతున్నారు
ట్రెండ్ సెట్టింగ్ 'బేబీ' సినిమాను టాలీవుడ్ కు అందించిన దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ లు ముందు ముందు మరిన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి సినిమాలను నిర్మించడంతో పాటు సాయి రాజేష్ కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించబోతున్నాడు.
బేబీ సినిమాను వీరిద్దరూ కలిసి తమిళ్ మరియు హిందీ లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా లో బడ్జెట్ లో బేబీ ని నిర్మించడం ద్వారా రిస్క్ లేకుండా బరిలో దిగాలని భావిస్తున్నారట. హిందీలో కంటే తమిళ్ లో బేబీ ని ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారట. అందుకే వెంటనే తమిళ్ బేబీ ని రెడీ చేయాలని భావిస్తున్నారు.
కేవలం బేబీ రీమేక్ మాత్రమే బేబీ తరహా లవ్ స్టోరీస్ మరియు కాలేజ్ లైఫ్ స్టోరీస్ తో సినిమాలను నిర్మించేందుకు గాను రెడీ అవుతున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించడంతో పాటు, తన దర్శకత్వ సారధ్యం లో కొత్త వారితో ఎస్కేఎన్ తో కలిసి సినిమాలను నిర్మించాలని భావిస్తున్నాడు అంటూ మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.
సాయి రాజేష్ వద్ద యూత్ ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్స్ స్క్రిప్ట్ లు చాలా ఉన్నాయట. అంతే కాకుండా ఆయన శిష్యుల వద్ద కూడా బేబీ తరహా స్క్రిప్ట్ లు ఉన్నాయట. వాటన్నింటిని కూడా తెరపైకి తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ కూడా లో బడ్జెట్ సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలుగానే ఉంటాయట. బేబీ ద్వారా వచ్చిన భారీ లాభాలను ఇలా సినిమాల మేకింగ్ పై పెట్టబోతున్న దర్శక నిర్మాతలకు భారీ ఎత్తున లాభాలు దక్కేనా చూడాలి.