ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మల్టీస్టారర్ ప్లాన్ చేస్తే!
టీడీపీ-జనసేన మధ్య స్నేహం కుదిరిన నాటి నుంచి పవన్ కళ్యాణ్- బాలకృష్ణ ఎంత క్లోజ్ గా ఉంటున్నారో తెలిసిం దే.
టీడీపీ-జనసేన మధ్య స్నేహం కుదిరిన నాటి నుంచి పవన్ కళ్యాణ్- బాలకృష్ణ ఎంత క్లోజ్ గా ఉంటున్నారో తెలిసిం దే. తొలిసారి ఇద్దరు అన్ స్టాపబుల్ షోలో కనిపించారు. అందులో బాలయ్య సరదాగా ప్రశ్నలు వేస్తుంటే? పవన్ అంతే సరదాగా జవాబులిచ్చారు. అప్పటి వరకూ ఆ కలయికను ఏ వేదికపై చూడలేదు. ఇది తొలిసారి చూసి మెగా-నందమూరి అభిమానులు ఎంతో మురిసిపోయారు.
ఆ తర్వాత రాజకీయాల్లో కూటమి ఏర్పడిన తర్వాత ఏకంగా పబ్లిక్ మీటింగ్ లో ఇద్దరు భుజాలపై చేతులు వేసుకుని ఒకరి పార్టీ కండువా..మరొకరు పట్టుకుని మా ప్రయాణం కలిసే అంటే అభిమానులకు, కార్తకార్తలకు అభివాదం చేసారు. ఇది చూసి అభిమానులు ఇంకా మురిసిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. బాలకృష్ణ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసారు.
హ్యాట్రిక్ స్టార్ గా ఆయన కూడా అసెంబ్లీలోకి మళ్లీ అడుతు పెడుతున్నారు. పార్టీలో ఇద్దరు కూడా కీలకంగా ఉండటంతో వారిని మంత్రి పదవులతో అలంకరిస్తే ఇంకా బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఎవర్నీ మంత్రుల్ని చేయాలి? అన్నది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. అది వేరే సంగతి. అయితే అసెంబ్లీ లో ఇరువురు అడుగుపెడుతున్న వేళ్ల సమావేశం మరింత ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.
ఓవైపు బాలయ్య..మరోవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే చూడాలని అభిమానులు అంతే ఆశపడుతున్నారు. ఆ క్షణాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఒకే కచ్చితంగా జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. కూటమిగా కలిసారు...కలిసి మల్టీస్టారర్ చేస్తే తప్పేముందు? బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోదా? అంటున్నారు. అందుకు అవకాశం కూడా లేకపోలేదు. వాళ్లిద్దరు ఒకే చెబితే చాలు స్టోరీలు రెడీ అయిపోతాయి. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎలాగూ అలవాటైన పనే కదా.