మోక్షజ్ఞ హీరోయిన్ గురించి లీకిచ్చిన బాలయ్య!
అయితే తన కుమారుడు మోక్షజ్ఞ తనతో మాట్లాడుతూ .. నాకేమీ హీరోయిన్లను మిగల్చవా డాడీ? అని అడిగాడని కూడా తెలిపారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఈనెల 19న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, శ్రీలీల కీలక పాత్రలో నటించింది. నేటి సాయంత్రం ప్రచార వేదికపై నటసింహా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. మోక్షజ్ఞతో తాను ఎలా ఉంటాడో, నందమూరి కుటుంబంలో సందడి ఎలా ఉంటుందో వెల్లడించారు.
ఇక భగవంత్ కేసరి సినిమాలో నటించిన శ్రీలీలతో కథానాయకుడిగాను నటించే అవకాశం ఉందని నటసింహా నందమూరి బాలకృష్ణ ఛూఛాయగా ఒక హింట్ ఇచ్చారు. శ్రీలీల అద్భుత నటి.. బార్న్ ఆర్టిస్ట్ అంటూ కితాబిచ్చేస్తూనే, తనతో మరిన్ని సినిమాల్లో నటించాలనుందని అన్నారు. అయితే తన కుమారుడు మోక్షజ్ఞ తనతో మాట్లాడుతూ .. నాకేమీ హీరోయిన్లను మిగల్చవా డాడీ? అని అడిగాడని కూడా తెలిపారు. మా ఇంట్లో మేం ఇలానే సరదాగా ఉంటామని కూడా బాలకృష్ణ అన్నారు. మోక్షజ్ఞ సరదా సంభాషణల్లో గ్రౌండ్ ఫ్లోర్ బలి**దా డాడీ అంటాడని కూడా తెలిపారు. ఆసక్తికరంగా నటసింహా తన మాటల్లో మోక్షజ్ఞ ప్రిపరేషన్ గురించి హింట్ ఇచ్చారు. తదుపరి మోక్షజ్ఞ నటించే సినిమా పట్టాలెక్కేందుకు ఛాన్సుందని కూడా ఆయన మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇంకా నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ``దుర్గమ్మ నవరాత్రులు జరుపుకుంటున్న ఈ తరుణంలో నా 108 చిత్రంగా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా వుంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కథ కూడా స్త్రీ శక్తికి సంబధించినదే. దుర్గమ్మ వాహనం పులి. ఈ సినిమాలో కూడా అమ్మాయిని పులిలా పెంచాలనే మాట వుంది. అలాగే సినిమా పేరు కూడా భగవంతుడితో మొదలైయింది. నేలకొండ భగవంత్ కేసరి హై ఎనర్జీ తో వుంటుంది`` అని అన్నారు.
అనిల్ రావిపూడి నా అభిమాని. ఆయన సినిమాలు గమనిస్తే అన్నీ వైవిధ్యంగా వుంటాయి. సినిమా సినిమాకి వైవిధ్యం చూపించారు. ఈసారి చాలా అద్భుతమైన కథతో వచ్చారు. నా జానర్ మిస్ కాకుండా తనదైన శైలిలో ఈ సినిమాని తీసారు. మేమిద్దరం ఈ సినిమా ఒక సవాల్ గా తీసుకున్నాం. చాలా హోం వర్క్ చేశాం. నేను ఏది చేసినా నా అభిమానులని దృష్టిలో పెట్టుకుంటాను. భగవంత్ కేసరి ట్రైలర్ అభిమానులు, ప్రేక్షకులు, అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇంకా గొప్పగా అలరిస్తుంది. నటుల నుంచి, సాంకేతిక నిపుణుల నుంచి తను కోరుకున్నది రాబట్టుకునే దర్శకుడు అనిల్. ఆయన లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి ఒక వరం... అని ప్రశంసించారు.
తమన్ అఖండతో బాక్సులు బద్దలగొట్టాడు. చాలా ప్రతిభావంతుడు. అద్భుతమైన పాటలు నేపధ్య సంగీతం అందించాడు. అలాగే రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన డీవోపీ. నా ప్రతి కదలిక తనకి తెలుసు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాం. తన కెమరా ద్వారా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేశారో ప్రేక్షకులు చూస్తారు. కాజల్ అద్భుతమైన నటి. చాలా మంచి పాత్ర చేశారు. ఒక విస్పోటనం జరిగితే గానీ ఇలాంటి కలయిక జరగదు. విస్పోటనం జరిగితేనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి మా భగవంత్ కేసరి అని అన్నారు.