'భరతనాట్యం' టైటిలేమో క్లాసిక్.. టీజర్ మాత్రం థ్రిల్లర్‌గా
ఇందులో భాగంగా తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది ఆద్యంతం ఫన్ అండ్ యాక్షన్‌తో ఆకట్టుకుంటూ అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలుగు చిత్ర సీమలో మరో కొత్త హీరో పరిచయం కానున్నాడు. అతడే సూర్య తేజ ఏలే. 'భరతనాట్యం' సినిమాతో రానున్నాడు. మీనాక్షి గోస్వామి హీరోయిన్. కామెడీ యాక్షన్ థ్రిల్లర్ రానున్న ఈ సినిమా రీసెంట్‌గానే ప్రమోషన్స్‌ను ప్రారంభించుకుంది. ఇందులో భాగంగా తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది ఆద్యంతం ఫన్ అండ్ యాక్షన్‌తో ఆకట్టుకుంటూ అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇండస్ట్రీలో కష్టపడే మనలాంటి హౌలాగాడి గురించే ఈ కథ అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'ఓ పేద అమ్మ, ఓ పేద నాన్న, ఒక శాడిస్టిక్ గర్ల్‌ఫ్రెండ్' అంటూ రొటీన్‌గా సాగిన ఈ ప్రచార చిత్రంలో ఆ తర్వాత అసలు కథ మొదలైంది. 'అలాంటి దరిద్రంలో నుంచి బయటపడడానికి ఓ తప్పు చేయడానికి సిద్ధమవుతాడు మన హీరో' అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో కామెడీగా సాగిన టీజర్.. వెంటనే సీరియస్ మోడ్‌లోకి మారుతుంది.
భరతనాట్యం కావాలి అంటూ టీజర్ అంతా మంచి సీరియస్‌గా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అయితే అసలు భరతనాట్యం ఏంటి అనేది టీజర్‌లో రివీల్ చేయలేదు మేకర్స్. టైటిల్ చూడడానికి క్లాసిక్‌గానే ఉన్నప్పటికీ.. ఇది ఓ క్రైమ్ కామెడీ జానర్‌లా సాగింది. మరి ఇంతకీ ఆ భరతనాట్యం అంటే తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
ఇక ఈ చిత్రాన్ని దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర తెరకెక్కిస్తున్నారు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈయన.. తన రెండో చిత్రాన్ని కూడా మంచిగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కథను గ్రిప్పింగ్‌గా ప్రజెంట్ చేశారు. ఓ ఫ్రెష్ స్టోరీలా ఉంది. స్టోరీ టెల్లింగ్, టెక్నికల్ - ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అన్నీ బాగున్నాయి. కొత్త నటుడే అయినా హీరోగా సూర్య తేజ నటన కూడా బాగుంది.
వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్, వెంకట్ ఆర్ శకమురి కెమెరా వర్క్ బాగానే ఉంది. రవితేజ గిరిజాలా ఎడిటర్‌గా వ్యవహరించారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ షరఫ్ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ వంటి చాలామంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫైనల్‌గా 'భరతనాట్యం' సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉంది.