నేరుగా సింగం జూలు దువ్వుతున్న కుర్ర‌హీరో

దీపావ‌ళి రేస్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ `సింగం ఎగైన్`ని రిలీజ్ చేసేందుకు చాలా ముందే రోహిత్ శెట్టి డేట్ ఫిక్స్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-26 16:02 GMT

దీపావ‌ళి రేస్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ `సింగం ఎగైన్`ని రిలీజ్ చేసేందుకు చాలా ముందే రోహిత్ శెట్టి డేట్ ఫిక్స్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్ప‌టికే క్యూరియాసిటీని పెంచింది. పోస్ట‌ర్లు, విజువ‌ల్స్ తో ఇప్ప‌టికే ర‌క్తి క‌ట్టించారు. అయితే ఇంత‌లోనే ఇప్పుడు యువ‌హీరో కార్తీక్ ఆర్య‌న్ న‌టించిన `భూల్ భుల‌యా 3`ని దీపావ‌ళి రేసులో దించేస్తున్నామ‌ని ప్ర‌క‌టించి షాకిచ్చారు.

కార్తీక్ ఆర్య‌న్ న‌టిస్తున్న భూల్ భుల‌యా 3 పైనా భారీ అంచ‌నాలున్నాయి. ఇది మోస్ట్ అవైటెడ్ హారర్-కామెడీ ఫ్రాంచైజీ నుంచి వ‌స్తున్న మూడవ చిత్ర గ‌నుక ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి నెల‌కొంది. దీపావ‌ళి రేస్ లో అంటూ కార్తీక్ ఆర్యన్ మరోసారి సరికొత్త పోస్టర్‌తో అభిమానులను థ్రిల్ చేసాడు. ప్రేక్షకులు రూహ్ బాబా- మంజులిక మధ్య ఒక ఎగ్జ‌యిట్ చేసే ఫేసాఫ్ ని ఆశించవచ్చని టీజ్ చేసాడు. రూహ్ బాబా వర్సెస్ మంజులికా...దీపావళి బ‌రిలో! అని పేర్కొన్నాడు. ఆసక్తిగా ఉన్న ఒక అభిమాని తన‌ ఉత్సాహాన్ని అణచుకోలేకపోయాడు... ఇది మోస్ట్ అవైటెడ్ వార్ ..! అని ఆనందం వ్య‌క్తం చేసాడు.

`భూల్ భూలయ్యా 3` పోస్ట‌ర్ లో ఆకాశంలో ఆత్మ‌లు క‌నిపిస్తున్నా.. క‌థానాయ‌కుడు దేనికైనా ఎదురెళ్లేవాడిగా డ్యాషింగ్ గా క‌నిపిస్తున్నాడు. నేప‌థ్యంలో హాంటెడ్ ప్యాలెస్ .. దాని ముందు వెలుగుతున్న‌ టార్చ్‌ను పట్టుకుని కార్తీక్ కనిపించాడు. తన పాత్ర, రూహ్ బాబా ఫ్రాంచైజీ విల‌న్ మంజులికను ఎదుర్కొంటుందని నొక్కి చెప్పాడు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్య‌న్ తో పాటు విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, ట్రిప్తి డిమ్రీ కీలక పాత్రలు పోషించారు. టీజర్ రేపు (సెప్టెంబర్ 27) విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించారు.

Tags:    

Similar News