బిగ్ బాస్ 8 : టాప్ ఓటింగ్ తో రెచ్చిపోతున్న కంటెస్టెంట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటివరకు జరిగిన 8 వారాల ఆటలో టైటిల్ విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయన్నది క్లారిటీ రాలేదు.

Update: 2024-10-24 10:16 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటివరకు జరిగిన 8 వారాల ఆటలో టైటిల్ విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయన్నది క్లారిటీ రాలేదు. రేసులో కొందరు ఉన్నారని అనిపిస్తున్నా కొన్నిసార్లు ఆడియన్స్ ని అలరించడంలో వారు వెనకపడుతున్నారు. అందుకే ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని చెప్పడం కష్టమవుతుంది. ఐతే ఉన్న వారిలో బయట ఆడియన్స్ లో ఒక క్రేజ్ తెచ్చుకుంది మాత్రం ప్రేరణ అని చెప్పొచ్చు.

హౌస్ లో కొందరు ఆమెను టార్గెట్ చేయడమే దీనికి ప్రధాన కారణం. ఐతే తన మార్క్ ఆట తో పాటు ఎలాంటి వారికైనా తన ఆన్సర్ ఇస్తూ సత్తా చాటుతుంది ప్రేరణ. మొదటి రెండు వారాలు అంతగా ఆకట్టుకోలేని ప్రేరణ చిన్నగా తన ఆట మారుస్తూ వచ్చింది. ఫలితంగా కొందరు హౌస్ మెట్స్ ఆమెను టర్గెట్ చేయడం ఆమె వారికి తగిన సమాధానం ఇవ్వడం ఇవన్నీ ఆమెకు ప్లస్ గా మారాయి.

అంతేకాదు హౌస్ లోకి మనం వచ్చింది ఆట ఆడి టైటిల్ గెలవడం కోసమే అన్న క్లారిటీ ప్రేరణలో చాలా ఉంది. మిగతా వాళ్లంతా వేరే వాళ్లతో కనెక్ట్ అయ్యి జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు ప్రవర్తిస్తుంటే ప్రేరణ మాత్రం అలాంటి పులిహోర కంటెంట్ కి దూరంగా ఉంటూ కేవలం ఒరిజినల్ స్టఫ్ ని అందిస్తుంది. ముఖ్యంగా నామినేషన్స్ టైం లో ప్రేరణ తనని నామినేట్ చేసిన హౌస్ మెట్స్ కి ఇచ్చే ఆన్సర్ ఆమెకి ఓట్స్ వేసే ఆడియన్స్ ని అలరిస్తుంది.

ప్రస్తుతానికి నిఖిల్, ప్రేరణ కచ్చితంగా టాప్ 5 కి వెళ్లే కంటెస్టెంట్స్ గా కనిపిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి అవినాష్ కచ్చితంగా ఈసారి టాప్ 5 కి చేరుకునే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సో ఈ ముగ్గురు టాప్ 5 కి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉండగా మిగతా ఇద్దరు ఎవరన్నది ఆడియన్స్ నిర్ణయించాల్సి ఉంది. ప్రేరణ ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం టైటిల్ రేసులో కూడా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఆమెకు ఇలా కలిసి వచ్చే ఎపిసోడ్స్ పడాలని ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోరుతున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ప్రేరణకి హైయ్యెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ వస్తున్నట్టు ఓటింగ్ అనాలిసిస్ ని బట్టి తెలుస్తుంది. ప్రేరణ ఫ్రెండ్ అయిన యష్మి కూడా మధ్యలో ఓటిన్ లో దూసుకెళ్లినట్టు అనిపించినా ఈమధ్య ఎందుకో యష్మి ఆటలో వెనకబడింది.

Tags:    

Similar News