బిగ్ బాస్ 8 : విన్నర్ ఎవరు..? రన్నర్ ఎవరు..?
వారిద్దరు లేకపోతే ఈ సీజన్ చాలా బోరింగ్ గా సాగేది
బిగ్ బాస్ సీజన్ 8 మరో మూడు రోజుల్లో ముగుస్తుంది. ఈ సీజన్ మొదటి నుంచి అన్ లిమిటెడ్ ట్విస్ట్ అండ్ టర్న్ అని చెబుతూ అనుకున్నట్టుగానే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ముందు వరకు ఆట ఒకలా ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత మరోలా మారింది. ముఖ్యంగా అవినాష్, రోహిణిల వల్ల హౌస్ లో ఎంటర్టైమెంట్ అదిరిపోయింది. వారిద్దరు లేకపోతే ఈ సీజన్ చాలా బోరింగ్ గా సాగేది. ఇక నిఖిల్, పృధ్వి, ప్రేరణ, నబీల్ లతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గౌతం, అవినాష్ బెస్ట్ ఆట ఆడారు.
అందుకే ఫైనల్ ఫైవ్ లో నిఖిల్, గౌతం, అవినాష్, ప్రేరణ, నబీల్ నిలిచారు. వీరిలో టైటిల్ ఫైట్ లో నిఖిల్ వర్సెస్ గౌతం ఫైట్ నడుస్తుంది. ఐతే ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గౌతం కు బయట ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడింది. వైల్డ్ కార్డ్ గా వచ్చిన అతను రెండో వారమే వెళ్లాల్సి ఉన్నా లక్కీగా సేఫ్ అయ్యాడు. అప్పటి నుంచి గౌతం ఎత్తుకి పైఎత్తు అనిపించేలా టాస్కుల్లో గెలిచినా గెలవకపోయినా తన ఆవేశంతో అవతల వారిని టార్గెట్ చేస్తూ ఆడియన్స్ దృష్టిలో పడ్డాడు.
బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ఫైట్ గౌతం, నిఖిల్ ల మధ్య జరుగుతుంది. ఈ ఇద్దరికి ఆడియన్స్ నుంచి సూపర్ సపోర్ట్ లభిస్తుంది. ఇద్దరికీ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. ఐతే నిఖిల్ మొదటి నుంచి హౌస్ లో ఉంటూ టాస్కుల్లో తన బెస్ట్ ఇస్తూ వచ్చాడు. అతను మధ్యలో అమ్మాయిల విషయంలో కాస్త రాంగ్ గా పోట్రే చేయబడ్డాడు. నిఖిల్ ఫ్యాన్స్ అంతా కూడా అతనికే సపోర్ట్ చేస్తూ గెలిపించాలని చూస్తున్నారు.
మరోపక్క గౌతం ఫాలోవర్స్ కూడా అతన్ని గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ లో తెలుగు కంటెస్టెంట్ గెలవాలని గౌతం ని ప్రోత్సహిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో భాష ప్రాతిపదికన చూస్తూ తెలుగు వాడు కాబట్టి గౌతం ని గెలిపించాలని సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. టైటిల్ రేసులో వీరిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎవరు గెలిచినా చాలా తక్కువ రేషియోతో గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ లో ఎవరిని విన్నర్ గా అనౌన్స్ చేస్తారు.. ఎవరిని రన్నర్ చేస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 8 లో విన్నర్ గురించి ఎవరికి వారే తమ ఎక్స్ పెక్టేషన్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో విన్నర్ ఎవరన్న దాని మీద ఒక రేంజ్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి.