బిగ్ బాస్ 8 : ఓవర్ స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ ఓవర్ స్మార్ట్ చార్జెస్..!
మొన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ నుంచి కొంతమందిని ఇమిటేట్ చేస్తూ అవినాష్, రోహిణి చేసిన కామెడీకి హౌస్ మెట్స్ అంతా సరదాగా నవ్వుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ మొదలైంది. మొన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ నుంచి కొంతమందిని ఇమిటేట్ చేస్తూ అవినాష్, రోహిణి చేసిన కామెడీకి హౌస్ మెట్స్ అంతా సరదాగా నవ్వుకున్నారు. వారి ప్రయత్నానికి మెచ్చిన బిగ్ బాస్ కిచెన్ టైమింగ్ ను ఒక రెండు గంటలు పెంచాడు. అంతేకాదు ఇన్ఫినిటీ రూం లోకి వెళ్లిన నబీల్ లిమిట్ లెస్ ఫుడ్ కావాలని నాగార్జునతో అడగడం వల్ల బిగ్ బాస్ నబీల్ కు హౌస్ మొత్తం లిమిట్ లెస్ ఫుడ్ కావాలంటే అతను సీజన్ మొత్తం స్వీట్స్, డ్రింక్స్ తాగకూడదని కండీషన్ పెట్టాడు దానికి నబీల్ ఒప్పుకుని హౌస్ మొత్తానికి లిమిట్ లెస్ రేషన్ ని వచ్చేలా చేశాడు.
ఇక మెగా చీఫ్ కంటెండర్ గా రాయల్ క్లాన్ దగ్గర ఉన్న చీఫ్ కంటెండర్ అవకాశాన్ని గంగవ్వకు ఇచ్చారు రాయల్ క్లాన్ సభ్యులు. ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జెస్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 4 లో ఎలాగైతే రోబో టాస్క్ పెట్టారో అదే కాన్సెప్ట్ తో ఓవర్ స్మార్ట్ ఫోన్స్ కోసం ఓవర్ స్మార్ట్ ఛార్జెస్ నుంచి చార్జింగ్ పెట్టుకోవాలి. మధ్యలో బజర్ మోగే టైం లో ఓవర్ స్మార్ట్ ఛార్జెస్ దగ్గర ఉన్న 3 కుండలను పగలకొట్టాలి.
ఐతే ఛార్జెస్ గార్డెన్ ఏరియాలో ఉండి దాన్ని ఆక్యుపై చేస్తే ఓవర్ స్మార్ట్ ఫోన్స్ హౌస్ మొత్తం తమ ఆదీనంలో పెట్టుకున్నారు. ఐతే టాస్క్ మొదలు కాకుండానే ఇరు క్లాన్స్ మధ్య జరిగిన ఫైట్ లో రెండు కుండలు పగిలిపోయాయి. చివరి కుండ మాత్రమే రాయల్ క్లాన్స్ బజర్ మోగే టైం లో పగలకొట్టే ప్రయత్నం చేశారు. ఇక ప్రేరణ దగ్గర ఛార్జింగ్ వైర్ తీసుకుని హౌస్ లోకి వచ్చి అవినాష్, రోహిణి, తేజ ఛార్జింగ్ పెట్టాలని ప్రయత్నించగా బిగ్ బాస్ అది వారి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలని కేవలం వైర్ తో పెట్టుకోవడం కుదరదని చెప్పాడు.
అలా ఛార్జెస్, ఫోన్స్ మధ్య ఫైట్ జరుగుతుంది. హరితేజ మణికంఠని కన్విన్స్ చేసి అతని గురించి హరి కథ చెప్పి 1 నిమిషం ఛార్జింగ్ పెట్టుకుంది. సో ప్రస్తుతానికి ఎవరి ఛార్జింగ్ తగ్గింది అంటే అవినాష్, తేజ, గౌతం, రోహిణి, మెహబూబ్ ఛార్జింగ్ ఒక్కొక్క పోల్ ఛార్జింగ్ తగ్గింది. హరితేజ మణికంఠ నుంచి ఛార్జింగ్ పెట్టుకుంది కాబట్టి ఆమెది ఛార్జింగ్ ఫుల్ గా ఉంది. గంగవ్వ ఆల్రెడీ మెగా చీఫ్ కంటెండర్ కాబట్టి ఆమె ఈ టాస్క్ లో లేదు.