బిగ్ బాస్ 8 : మెగా చీఫ్ గా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో మెగా చీఫ్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ అయ్యారు.

Update: 2024-10-12 05:01 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో మెగా చీఫ్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ అయ్యారు. హోటల్ టాస్క్ లో బెస్ట్ ఇచ్చిన వారితో పాటుగా మెగా చీఫ్ అర్హులుగా కొందరిని సెలెక్ట్ చేయగా వారికి విడతల వారిగా టాస్కులు పెట్టిన బిగ్ బాస్ ఫైనల్ గా మెగా చీఫ్ ఎంపికను పూర్తి చేశాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి మెగా చీఫ్ నబీల్ కాగా రెండో వారం మెగా చీఫ్ గా మెహబూబ్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో పింగాణి పాత్రల టాస్క్ లో చివరి దాకా మెహబూబ్, హరితేజ మధ్య గట్టి పోటీ ఏర్పడింది.

అంతకుముందే బ్యాలెన్స్ ని సరిగా చేయలేక అవినాష్, మణికంఠ టాస్క్ నుంచి నిష్క్రమించగా చివరి దాకా హరితేజ ఫైట్ చేసింది. ఐతే మెహబూబ్ కన్నా ముందు మరో ప్లేట్ ని హరితేజ పెట్టినా సంచాలక్ గా చేసిన నబీల్ మెహబూబ్ ని విన్నర్ గా తేల్చి చెప్పాడు. ఐతే నబీల్ నిర్ణయాన్ని హౌజ్ మెట్స్ కొందరు తప్పుబట్టారు. హరితేజ బిగ్ బాస్ ఇచ్చిన మరో బోల్ తీసుకుంది కాబట్టే ఆమె ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.

ఇక ఈ వారం మెగా చీఫ్ గా మెహబూబ్ తన సారధ్యంలో హౌస్ ని నడిపించనున్నాడు. మెగా చీఫ్ ఒక్కడే అయినా రాయల్, ఓజీ క్లాన్స్ మధ్య టాస్కులు కొనసాగుతాయి. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఆట మరింత రసవత్తరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మెట్స్ ఉన్నారు.

ఈసారి లీస్ట్ పొజిషన్ లో పృధ్వి, సీత ఉన్నారు. విష్ణు ప్రియ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా డౌన్ ఫాల్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం సీతనే ఎలిమినేట్ అవుతుందని అందరు అంటున్నారు. ఐతే శనివారం ఎపిసోడ్ పూర్తయ్యే లోపే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో మెహబూబ్ టాస్కుల్లో సత్తా చాటుతున్నాడు. అతను కూడా రేసులో దూసుకెళ్తున్నాడు. సీజన్ 4 లో అతన్ని టాస్కులే దాదాపు టాప్ ప్లేస్ దాకా తీసుకెళ్లాయి. సీజన్ 8 లో కూడా మెహబూబ్ తన సత్తా చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

Tags:    

Similar News