బిగ్ బాస్ 7 : ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
ప్రస్తుతానికి కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, గౌతం కృష్ణ వీళ్లు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7 లాస్ట్ సండే గ్రాండ్ గా మొదలై మండే నుంచి ఎప్పటిలానే హౌస్ మెట్స్ హంగామాతో కొనసాగుతుంది. అయితే ఈ సీజన్ ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేసేలా చేస్తున్నారు బిగ్ బాస్ టీం. ప్రతి రోజు ఎపిసోడ్ లో ఏదో ఒక సెగ్మెంట్ అటు హౌస్ మెట్స్ కి.. ఇటు ఆడియన్స్ కి ఎంటర్టైన్ అయ్యేలా చేస్తున్నారు. ఇక వచ్చీ రాగానే ఒక రోజు ముగిసిందో లేదో నామినేషన్స్ పెట్టడం బిగ్ బాస్ కి అలవాటే. మొదటి వారమే కదా అన్న జాలి కరుణ అనేదే లేకుండా ఎలిమినేషన్ చేస్తుంటాడు.
సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఇప్పటివరకు హౌజ్ లో ఉన్న వారంతా కంటెస్టెంట్సే కానీ హౌస్ మెట్స్ కాదంటూ బిగ్ బాస్ కొత్త మెలిక పెడుతున్నా నామినేషన్ ప్రక్రియ మాత్రం ముందు సీజన్ల లానే నిర్వహించారు. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మోడల్ ప్రిన్స్ యావర్, షకీలా, శోభా శెట్టి, గౌతం కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, రతిక, దామిని ఉన్నారు. ఈ వారం వారు హౌజ్ చేసిన పర్ఫార్మెన్స్, చేసిన టాస్కులను బట్టి హౌస్ లో వారు కొనసాగించాలా వద్దా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు.
అయితే ఇంకా హౌస్ మెట్స్ గానే కన్ ఫర్మ్ అవని వీళ్లని బిగ్ బాస్ ఎలా ఎలిమినేట్ చేస్తాడు అన్న డౌట్ ఆడియన్స్ లో ఉంది. అంతేకాదు ఈ వారం నామినేషన్స్ లో ఉన్న 8 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది కూడా క్లారిటీ లేదు. మండే ఓపెన్ అవ్వాల్సిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం అయ్యింది. ప్రస్తుతానికి కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, గౌతం కృష్ణ వీళ్లు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సీజన్ 6 ఫ్లాప్ అవడంతో బిగ్ బాస్ టీం సీజన్ 7 ని ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేస్ ద బీస్ట్ ఛాలెంజ్ పూర్తి కాగా ప్రస్తుతం ఐదు వారాల ఇమ్యూనిటీ కోసం కంటెస్టెంట్స్ అంతా కూడా ప్రయత్నిస్తున్నారు. ఫేస్ ద బీస్ట్ లో సందీప్, ప్రియాంక జైన్ లు విజేతలుగా నిలిచారు. శుక్రవారం నైట్ 12కి ఈ వారం ఓటింగ్స్ క్లోజ్ అవుతాయి.
సో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది శనివారం ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం శనివారం తెలిసిపోతుంది. అయితే ఈసారి ఉల్టా పుల్టా అంటున్నారు కాబట్టి బయటకు ఒకరిని లీక్ చేసి మరొకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు.