'యానిమల్'.. కన్నీళ్లు పెట్టుకున్న బాబీ డియోల్
అంతేకాదు రెండు రోజుల్లోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'యానిమల్' మూవీ డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం నార్త్ లో దుమ్ము లేపుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రణబీర్ ఈ సినిమాతో తన కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్నాడు.
అంతేకాదు రెండు రోజుల్లోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే శనివారం మూవీ టీం ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించగా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ భావోద్వేగానికి లోనవుతూ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
యానిమల్ మూవీలో మోస్ట్ వైలెంట్ విలన్ గా కనిపించాడు బాబీ డియోల్. ఎలాంటి డైలాగ్స్ చెప్పకుండా తన ఎక్స్ప్రెషన్స్ తోనే భయపెట్టాడు. చాలాకాలం తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ ఇతని పర్ఫామెన్స్ గురించి మెచ్చుకుంటున్నారు. ఒకవిధంగా యానిమల్ బాబి డియోల్ కి బాలీవుడ్ కం బ్యాక్ మూవీ అనే చెప్పొచ్చు. కాగా శనివారం మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సక్సెస్ పార్టీలో బాబి డియోల్ మాట్లాడుతూ.. 'యానిమల్ తో నా కల నిజమైనట్లు అనిపిస్తోంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన ఆయన ఫ్యాన్స్ సైతం ఎమోషనల్ అవుతున్నారు. కాగా యానిమల్ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీతో బాబీ డియోల్ కి అన్ని ఇండస్ట్రీ నుంచి భారీ ఆఫర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో హరిహర వీరమల్లు సినిమాలో నటించిన ఈ బాలీవుడ్ యాక్టర్..
ఇప్పుడు బాబి - బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాడు. ఇక రానున్న రోజుల్లో ఈ బాలీవుడ్ యాక్టర్ బిజీ యాక్టర్ గా మారతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ తండ్రి పాత్ర పోషించారు.