ఫోటో స్టోరి: ప‌రిణీతి క్లాసీ లెహంగా రెడ్ బ్లౌజ్ లుక్

కుటుంబాల్ని రాజ‌కీయం చీల్చుతుంది. తండ్రి- కొడుకు, అన్న -త‌మ్ముడు, అక్క - చెల్లి ఎవ‌రికైనా ఎడ‌బాటు త‌ప్ప‌దు.

Update: 2025-02-11 03:19 GMT

కుటుంబాల్ని రాజ‌కీయం చీల్చుతుంది. తండ్రి- కొడుకు, అన్న -త‌మ్ముడు, అక్క - చెల్లి ఎవ‌రికైనా ఎడ‌బాటు త‌ప్ప‌దు. వారి మ‌ధ్య బంధానికి శుభం కార్డు ప‌డిన‌ట్టే. రాజ‌కీయం ఏదైనా చేయ‌గ‌ల‌దు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ ప్రియాంక చోప్రా- ప‌రిణీతి చోప్రా సిస్ట‌ర్స్. పారీ ఆప్ నాయ‌కుడు రాఘ‌వ్ చ‌ద్దాను పెళ్లాడిన త‌ర్వాత రాజ‌కీయంగా భాజ‌పాకు చేరువ‌గా ఉన్న ప్రియాంక చోప్రాతో విభేధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.


ఆప్ నాయ‌కుడితో త‌న సోద‌రి పరిణీతి పెళ్లికి భాజ‌పా అనుకూల ప్రియాంక చోప్రా అటెండ్ కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా సోద‌రుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లిలో ప‌రిణీతి చోప్రా తాను ఎంత‌గానో ఆరాధించే సోద‌రి ప్రియాంక చోప్రాకు దూరంగా ఉంది. క‌లిసి ఫోటోసెష‌న్లు లేవ్. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా క‌ల‌త‌లున్నాయ‌ని ముంబై మీడియా క‌థ‌నాలు వండి వారుస్తోంది.


ఇదే పెళ్లిలో ప‌రిణీతి చోప్రా డిజైన‌ర్ లెహంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పారీ ఫ్లోర‌ల్ లెహంగా, కుర‌చ‌ స్టైల్ బ్లౌజ్ లో ఎంతో ముగ్ధ మ‌నోహ‌రంగా క‌నిపించింది. పరిణీతి అందమైన లేత గోధుమ రంగు ప‌రికిణీ, అందమైన పూల లెహంగా సెట్‌లో అద్భుతంగా క‌నిపించింది. బ్లౌజ్ బోల్డ్ రెడ్ షేడ్ లేత గోధుమరంగు లెహంగా స్కర్ట్‌కు స‌రిగ్గా మ్యాచ్ అయింది. పారీ మొత్తం లుక్‌ను బ్యాలెన్స్ చేసేందుకు ప్ర‌ణాళికా బ‌ద్ధంగా క‌నిపించింది. పారీతో పాటు ఈవెంట్లో రాఘ‌వ్ చ‌ద్దా కూడా ఉన్నారు. ఈ జంట షో స్టాప‌ర్స్ గా మారారు. ముఖ్యంగా ప‌రిణీతి యూనిక్ లుక్ అంద‌రి క‌ళ్ల‌ను ఆక‌ర్షించింది. పెళ్లి త‌ర్వాత పారీ సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News