రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డుల‌తో స్టార్ల‌కు భారీ లాభాలు

ముంబై ఔట‌ర్ లో డెవ‌ల‌ప్ మెంట్ దృష్ట్యా బాలీవుడ్ సెల‌బ్రిటీలు భారీగా రియ‌ల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నారు.

Update: 2025-01-25 14:30 GMT

ముంబై ఔట‌ర్ లో డెవ‌ల‌ప్ మెంట్ దృష్ట్యా బాలీవుడ్ సెల‌బ్రిటీలు భారీగా రియ‌ల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నారు. అమితాబ్ - అభిషేక్ ద్వ‌యం, బోనీ-జాన్వీ ద్వ‌యం, ఒబెరాయ్ వంటి వారి రియ‌ల్ పెట్టుబ‌డుల‌పై ఇప్ప‌టికే ప‌లు క‌థ‌నాలొచ్చాయి. ఇటీవ‌లే శ్ర‌ద్ధా క‌పూర్ 7 కోట్ల ఖరీదైన అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసింది.

ఇప్పుడు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్షయ్ కుమార్ ముంబైలోని తన బోరివాలి ఈస్ట్ అపార్ట్‌మెంట్‌ను రూ.4.25 కోట్లకు అమ్మేశాడు. దీని స్థానంలో మ‌రోచోట భారీ కొనుగోలు కోసం ప్లాన్ చేసార‌ని స‌మాచారం. అక్ష‌య్ సేల్ చేసిన ఫ్లాట్ అధునాతన ఒబెరాయ్ స్కై సిటీ కాంప్లెక్స్‌లో ఉంది. ఇది 1073 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. రెండు పార్కింగ్ స్థలాల‌పై య‌జ‌మానికి హ‌క్కు ఉంది.

కేవ‌లం రూ.2.38 కోట్లకు ఈ ఆస్తిని అక్ష‌య్ 2017లో కొనుగోలు చేయ‌గా, ఇప్పుడు భారీ లాభానికి దీనిని అమ్మాడు. ఈ ధర చూశాక‌, ముంబైలో రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతోందో అర్థం చేసుకోవాలి. ఇంత‌కుముందు అమితాబ్ బ‌చ్చ‌న్ కేవ‌లం 31 కోట్ల‌కు కొన్న ఒక అపార్ట్ మెంట్ ని ఏకంగా 83 కోట్ల‌కు సేల్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. దాదాపు 49 కోట్ల మేర నాలుగేళ్ల‌లో లాభం అందుకున్నారు అమితాబ్. దాంతో పోలిస్తే అక్ష‌య్ కి ద‌క్కిన లాభం చాలా చిన్న‌ది.

అక్షయ్ కుమార్ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే న‌టుల్లో ఒక‌రు. ఒక్కో చిత్రానికి దాదాపు రూ.150 కోట్లు వసూలు చేస్తున్నారు. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో నిరంత‌రం బిజీగా ఉండే ఈ హీరో, అన్ లిమిటెడ్ గా డబ్బు సంపాదిస్తున్నాడు. అతడు న‌టించిన స్కై ఫోర్స్ ఇటీవ‌ల థియేటర్లలో విడుదలైంది. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత కంబ్యాక్ కోసం అత‌డు ప్ర‌య‌త్నిస్తున్నాడు.

Tags:    

Similar News