మోస‌గాడు అని ప్ర‌చారం చేసారు: ర‌ణ‌బీర్

నిఖిల్ కామత్ పోడ్‌కాస్ట్ 'పీపుల్ బై WTF'లో ర‌ణ‌బీర్ ఈ సంగ‌తులు వెల్లడించాడు. ఆ పాత సంగ‌తుల‌ను ప్రేమ‌ల్ని ఓపెన‌య్యేందుకు భయపడుతున్నందున అసమర్థంగా ఉన్నాన‌ని అతడు అన్నాడు.

Update: 2024-07-21 11:59 GMT

''ఇద్ద‌రు హీరోయిన్‌ల‌ను ప్రేమించాను.. న‌న్ను మోస‌గాడిగా చిత్రించారు.. కాస‌నోవా అన్నారు!'' అంటూ ప్ర‌ముఖ‌ స్టార్ హీరో ఆవేద‌న చెందాడు. తాను గతంలో ఇద్దరు విజయవంతమైన నటీమణులతో డేటింగ్ చేశాన‌ని కూడా ఆ స్టార్ హీరో అంగీక‌రించాడు. నా జీవితంలో చాలా ఎక్కువ భాగం నన్ను 'మోసగాడు' (మ‌గువ‌ల‌) అని పిలిచార‌ని, దానికి బాధ‌ప‌డ్డాన‌ని అన్నారు. ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ ర‌ణ‌బీర్ క‌పూర్.

నిఖిల్ కామత్ పోడ్‌కాస్ట్ 'పీపుల్ బై WTF'లో ర‌ణ‌బీర్ ఈ సంగ‌తులు వెల్లడించాడు. ఆ పాత సంగ‌తుల‌ను ప్రేమ‌ల్ని ఓపెన‌య్యేందుకు భయపడుతున్నందున అసమర్థంగా ఉన్నాన‌ని అతడు అన్నాడు. త‌న రియ‌ల్ ప్రేమ‌క‌థ‌ల‌పై మాట్లాడుతూ తాజా ఎపిసోడ్ ట్రైలర్ లో రణబీర్ నిష్కపటంగా క‌నిపించాడు. ఉన్న విష‌యాల‌ను ఓపెన‌వ్వ‌డంతో ఇది ఆసక్తిని రేకెత్తించింది.

ట్రైలర్‌లో రణబీర్ థెరపీ సెష‌న్‌లో తన ప్రయత్నాన్ని ప్రస్తావించాడు. ఆ విష‌యాన్ని చెప్పేందుకు త‌న‌కు ఎటువంటి అభ్యంతరాలు లేనప్పటికీ దానిపై ఓపెన‌య్యేందుకు పోరాడుతున్నాడని పేర్కొన్నాడు. థెరపీ అనేది మెంటల్ వర్కౌట్ లాంటిదేనా? అని అతడు ప్రశ్నించాడు. దానికి నిఖిల్ కామత్ స్పందిస్తూ అది పని పనితీరును మెరుగుపరుస్తుందని అన్నారు. త‌న‌ను మోస‌గాడు అని పిల‌వ‌డం ఇప్పటికీ తనను ప్రభావితం చేస్తుంద‌ని అన్నాడు ర‌ణ‌బీర్. ఇది తనను బాధపెడుతుందా? అని అడిగినప్పుడు గుంభ‌న‌గా నవ్వేశాడు.

ఈ ట్రైలర్‌లో రణబీర్ కపూర్ తన కుమార్తె రాహా పుట్టుక గురించి ప్ర‌స్థావించాడు. తన హృదయాన్ని(రాహాను) ఆలియా చేతుల్లో ఉంచాన‌ని అన్నాడు. అలియా భట్ ని తన ఎక్స్‌టెన్షన్‌గా రాహా చూసుకుంటుందని స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. అతడు తన దివంగత తండ్రి రిషి కపూర్ త‌న‌ను అందుకు విరుద్ధంగా చూసాడ‌ని కూడా తెలిపాడు. పాపా రిషీక‌పూర్ కఠినంగా ఉండేవార‌ని తెలిపాడు. గతంలో దీపికా పదుకొనే, కత్రినా కైఫ్‌లతో ర‌ణ‌బీర్ కపూర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఒక‌రికి తెలియ‌కుండా ఇంకొక‌రిని చీటింగ్ చేసాడ‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. దానిని ఇప్పుడు ర‌ణ‌బీర్ గుర్తు చేసుకుని ఆవేద‌న చెందాడు.

Tags:    

Similar News