ఇతను బాలీవుడ్ సంపూర్ణేష్ బాబు!
సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా ఇప్పటికీ సొంతూరులోనే ఉంటాడు. సైకిల్ మీద తిరుగుతాడు..ఇంటి అవసరాల కోసం బిందెలతో నీళ్లు తీసుకొస్తాడు.
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సుపరిచితుడే. `హృదయ కాలేయం` అంటూ తెలుగు తెరకు పరిచయమైన నటుడు పై అటుపై కొన్ని సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటుడు. సంపూ నటుడైనా మ్యాకప్ తీసేస్తే సాధారణ జీవితాన్ని గడుపుతాడు. సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా ఇప్పటికీ సొంతూరులోనే ఉంటాడు. సైకిల్ మీద తిరుగుతాడు..ఇంటి అవసరాల కోసం బిందెలతో నీళ్లు తీసుకొస్తాడు.
కాయ కష్టం చేస్తాడు. నటుడైన తర్వాత ఇలా నిరాడంబరంగా ఉండటం అన్నది గొప్ప విషయం. అందులో సంపూర్ణేష్ బాబు నిజంగా మెచ్చుకోవాల్సిందే. నటుడైనా ఇలా ఎందుకు చేస్తున్నారంటే? సినిమా అనేది గ్యారెంటీ లైఫ్ కాదు. అవకాశాలున్నంత కాలం చేస్తాం. అవకాశాలు లేకపోతే మళ్లీ పాత వృత్తిలో కొనసాగాల్సిందే కదా! అన్నది ఆయన నమ్మిన సిద్దాంతం. ఈవిషయంలో సంపూ ని స్పూర్తిగాను తీసుకొవచ్చు.
తాజాగా బాలీవుడ్ లో కూడా ఇలాంటి సంపూర్ణేష్ బాబు ఒకరున్నట్లు తెలుస్తోంది. అతనే సోలంకి దివాకర్. డ్రీమ్ గర్ల్.. ది వైట్ టైగర్.. సోంచారియా లాంటి చిత్రాల్లో నటించిన సోలంకికి సినిమాలంటే పిచ్చి. చాలా చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించాడు. అలాంటి సోలంకి సినిమా నటుడైనా తన వృత్తిని మాత్రం వదల్లేదు. సినిమాల్లోకి రాకముందు అతను పండ్ల వ్యాపారి. ఢిల్లీలో పది సంవత్సరాలుగా అదే వృత్తిలో ఉన్నాడు. ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.
కరోనా సమయంలో సినిమాలు లేకపోవడంతో పండ్ల వ్యాపారమే పొట్ట నింపింది. ఇప్పటికీ అంత బిజీ నటుడు కాకపోవడంతో వ్యాపారం నడిపిస్తున్నాడు. ఎక్కువగా అవకాశాలు వస్తే మాత్రం బిజినెస మానేస్తా అంటున్నాడు. కుటుంబ పోషణం కోసం ఇలా రెండు రకాల వేశాలు వేస్తున్నానిన తెలిపాడు. పండ్ల వ్యాపారకంటే ముందు యూపీ థియేటర్లలో పాపడ్ వ్యాపారం చేసాడు. సినిమాల్లో అవకాశాలు వస్తే 1000 సినిమాలైనా చేస్తాను. కానీ అవకాశాలు రావడం లేదని వాపోయాడు.