బాక్సాఫీస్.. నవంబర్ లో అన్ని షాకులే!
అద్భుతం అనిపించుకునే సినిమా ఒకటి కూడా నవంబర్ లో రాకపోవడం గమనార్హం.
టాలీవుడ్ నుంచి ప్రతినెల పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒక్కోనెల నిర్మాతలు, బయ్యర్లకు సినిమాలు సాలిడ్ సక్సెస్ తో పాటు లాభాలు తెచ్చి పెడుతూ ఉంటాయి. అయితే కొన్ని నెలలు మాత్రం నిరాశ తప్పదు. ఈ నవంబర్ కూడా టాలీవుడ్ లో బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. అద్భుతం అనిపించుకునే సినిమా ఒకటి కూడా నవంబర్ లో రాకపోవడం గమనార్హం.
ఈ నెలలో బజ్ క్రియేట్ చేసిన చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వాటిలో కీడా కోలా, మా ఊరి పొలిమేర 2, కార్తీ హీరోగా నటించిన జపాన్, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్తాండ డబుల్ ఎక్స్, అజయ్ భూపతి మంగళవారం, రీమేక్ సినిమా కోటబొమ్మాలి ఉన్నాయి. వీటిలో బయ్యర్లకు కొంతమేరకు లాభాలు తెచ్చి పెట్టిన సినిమా అంటే మా ఊరి పోలిమేర 2 మాత్రమే.
మిగిలిన సినిమాలలో కొన్ని పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కూడా థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. వాటిలో మంగళవారం, జిగర్తాండ డబుల్ ఎక్స్ ఉన్నాయి. మంగళవారం సినిమాకి ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అలాగే మంచి హైప్ తో రిలీజ్ అయ్యి సాలిడ్ గా ఓపెనింగ్స్ కూడా కలెక్ట్ చేసింది. తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రాకపోవడంతో బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయింది.
బయర్లకు కొంత మేరకు నష్టాన్ని తీసుకొచ్చింది. డబ్బింగ్ మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్ కి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చిన కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. కార్తి జపాన్ సినిమా అయితే మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తో నడిచింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కీడా కోలా సినిమాకి ఓవర్సీస్, హైదరాబాద్ లో మాత్రమే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వచ్చాయి.
మిగిలిన చోట్ల పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక కోటబొమ్మాలి మూవీ కేవలం రెండు కోట్ల టార్గెట్ తో రిలీజ్ కావడం వల్ల బయ్యర్లు సేఫ్ అయ్యారు. ఓవరాల్ గా నవంబర్ లో చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ అంటే అది మా ఊరి పొలిమేర 2 మాత్రమే.