అభిమాని కౌగిలిలో క‌రెంట్ షాక్.. గాయ‌కుడు మృతి!

బ్రెజిలియన్ సింగర్ ఐరెస్ ససాకి 35 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఒక ఈవెంట్లో ప్రత్యక్ష ప్రదర్శన సమయంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అహూతుల‌ను నిర్ఘాంత‌ప‌రిచింది.

Update: 2024-07-21 17:44 GMT

35 వ‌య‌సు గాయ‌కుడు తాను లైవ్ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్న వేదిక‌పైనే దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. అది కూడా త‌న అభిమానిని కౌగిలించుకుని వెళ్లేందుకు సిద్ధ‌మైన అత‌డికి స‌డెన్ గా మెరుపులాంటి క‌రెంట్ షాక్ త‌గిలింది. దీనికి కార‌ణం అత‌డి స‌మీపంలోని ఒక కేబుల్. అయితే ఈ మ‌ర‌ణం స‌హ‌జ మ‌ర‌ణ‌మా? ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

బ్రెజిలియన్ సింగర్ ఐరెస్ ససాకి 35 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఒక ఈవెంట్లో ప్రత్యక్ష ప్రదర్శన సమయంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అహూతుల‌ను నిర్ఘాంత‌ప‌రిచింది. అతడి చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఘటన జరిగినప్పుడు 35 ఏళ్ల గాయకుడు సాలినోపోలిస్‌లో సోలార్ హోటల్‌లో ప్రదర్శన ఇస్తున్నారు. మీడియా క‌థ‌నం ప్రకారం.. అతడు తడిసిన అభిమానిని కౌగిలించుకోవడానికి అత‌డి వ‌ద్ద‌కు చేరుకున్నాడు. కానీ అది ప్రాణాంతకమైన కుదుపుగా మారింది. వారికి సమీపంలోని కేబుల్ నుంచి సౌర విద్యుత్ వారి శ‌రీరాల్లోకి ప్ర‌వేశించింది. గాయ‌కుడు వెంటనే చనిపోయాడు. అతడికి భార్య ఉన్నారు. ఒక సంవత్సరం కిందటే వివాహం చేసుకున్నాడు.

గాయకుడి అత్త రీటా మాటోస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అనూహ్య‌ సంఘటనల మలుపుల‌తో గందరగోళానికి గురయ్యారని ది మిర్రర్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. స్థానిక వార్తా సంస్థతో రీటా మాట్లాడుతూ, -''మాకు తెలిసిన విషయం ఏమిటంటే అతడి ప్రదర్శన నిర్దిష్ట సమయానికి షెడ్యూల్ చేసారు. పైకి వెన్యూని మార్చారు. అయితే ప్రతిదీ ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి మేము అతడితో ఉన్న వ్యక్తులను సంప్రదిస్తున్నాము. మేము పత్రికలకు విడుదల చేసే ప్రకటనలో మొత్తం సమాచారాన్ని సేకరిస్తాము'' అని అన్నారు.

కచేరీకి వెళ్లే అభిమాని ఎందుకు త‌డిసి ఉన్నాడు? అనేది అస్పష్టంగానే ఉంది.. అయితే సాలినోపోలిస్ పోలీసులు ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన హోటల్ కూడా ఒక ప్రకటన విడుదల చేసిందని డెడ్‌లైన్ నివేదించింది. అతడి కుటుంబానికి మద్దతు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మేం పూర్తిగా అంకితభావంతో ఉన్నాము. ఈవెంట్‌ల సరైన వివరణ కోసం సమర్థ అధికారులతో పూర్తిగా సహకరించడానికి మేము మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము''అని హోటల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో మా ఆలోచనలు, సానుభూతి ఐరెస్ ససాకి కుటుంబం, స్నేహితులకు తెలియ‌జేసాము'' అని రాసారు.

గాయ‌కుడి మృతిపై అత‌డి భార్య మ‌రియానా కూడా స్పందించింది. మరియానా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసారు. ''ఈ కష్ట సమయంలో ప్రతి ప్రార్థనకు ఆప్యాయత ఓదార్పునిచ్చే ప్రతి సందేశానికి మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంకా అన్ని మెసేజ్‌లను చదవలేకపోయాను.. వీలున్న ప్రతిదానికి నేను ప్రతిస్పందిస్తాను. ధన్యవాదాలు'' అని తెలిపారు.

Tags:    

Similar News