స్త్రీ2 బాక్సాఫీస్… ఇంత అతి ఎందుకు?

అయితే ఇప్పుడు స్త్రీ2 మూవీ కలెక్షన్స్ పై బిటౌన్ లో పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.

Update: 2024-08-18 09:30 GMT

ఈ మధ్యకాలంలో సినిమా కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ప్రమోషన్ స్ట్రాటజీలలో భాగంగానే ఫస్ట్ డే కలెక్షన్స్ అంటూ భారీ నెంబర్స్ ని ప్రకటిస్తారు. అలాగే రెండు రోజు కలెక్షన్స్ అంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. తరువాత 100 కోట్ల గ్రాస్ అంటూ మరో పోస్టర్ ని రిలీజ్ చేస్తారు. ఇలా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయని చూపిస్తూ పబ్లిక్ అటెన్షన్ ని గ్రాబ్ చేసే ప్రయత్నం మేకర్స్ చేస్తూ ఉంటారు.

అయితే ఇలా పోస్టర్స్ ద్వారా ప్రకటిస్తున్న కలెక్షన్స్ లలో చాలా వరకు వాస్తవంగా ఉండవని సినీ విశ్లేషకులు అంటూ ఉంటారు. ఒరిజినల్ కలెక్షన్స్ ని అదనంగా 20 శాతం పెంచి కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఉంటారనే అభిప్రాయం ఉంది. చాలా తక్కువ మంది ఒరిజినల్ కలెక్షన్స్ జెన్యూన్ గా ప్రకటిస్తారని నమ్ముతారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకి ఫేక్ కలెక్షన్స్ ని ఎనౌన్స్ చేస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

ఎప్పటికప్పుడు బాలీవుడ్ లో ఈ ఫేక్ కలెక్షన్స్ పైన విమర్శలు వస్తూనే ఉంటాయి. తాజాగా హిందీలో రిలీజ్ అయిన స్త్రీ2 చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం సినిమాల కంటే ఎక్కువ ఆదరణ స్త్రీ2కి లభిస్తోంది. ఫిల్మ్ క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అయితే ఇప్పుడు స్త్రీ2 మూవీ కలెక్షన్స్ పై బిటౌన్ లో పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.

అయితే దీనిపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అయిన కూడా ఫేక్ కలెక్షన్స్ ని ప్రచారం చేయడం ఎందుకనే ప్రశ్న వినిపిస్తోంది. స్త్రీ2 మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు 30 కోట్లు వసూళ్లు చేసింది. ఒరిజినల్ కలెక్షన్స్ చూసుకున్న ఈ మూవీ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసిందని అర్ధం అవుతోంది.

అయితే అదనంగా 10 కోట్లు యాడ్ చేసి చిత్ర నిర్మాతలు పోస్టర్స్ రిలీజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలెక్షన్స్ లు హెవీగా చేసి చూపించడం అస్సలు ఆడని సినిమాలకి జరుగుతుందని తెలుసు. కానీ అది పొరపాటని ఇప్పుడే అర్ధమైంది అంటూ ఓ థియేటర్ యజమాని కామెంట్ చేశారు. ఒక సినిమా ఆల్ రెడీ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఎక్స్ ట్రాగా కలెక్షన్స్ చూపించాల్సిన అవసరం ఏముందని ఓ ఫిల్మ్ క్రిటిక్ ప్రశ్నించారు.

ఇండస్ట్రీలో పెద్ద స్కామ్ జరుగుతోంది. ఒకప్పుడు 1 శాతం, 2 శాతం కలెక్షన్స్ పెంచి చూపించేవారు. ఇప్పుడు ఏకంగా 20 శాతం ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నారు అంటూ ఒక డిస్టిబ్యూటర్ ట్వీట్ చేశారు. ఫేక్ కలెక్షన్స్ ని బాలీవుడ్ మీడియా సర్కిల్ లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోందని చెప్పొచ్చు. దీనిపై స్త్రీ 2 మూవీ మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి.

Tags:    

Similar News